‘తెలంగాణ’ పంట కాబట్టే పసుపుపై వివక్ష
ఆర్మూర్, న్యూస్‌లైన్ :
పసుపు పంట తెలంగాణ ప్రాంతంలోనే అధికంగా పండిస్తున్నారని కాబట్టి పసుపు రైతుల సమస్యలు పరిష్కరించడం లో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రి య కల్యాణ మండపంలో శనివారం ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విజన్ ఆర్మూర్’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. కమ్మర్పల్లి ప్రాంతంలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి ఏడేళ్లు అవుతున్నా తెలంగాణ ప్రాంతంలో ఉండటం కారణంగా సీమాంధ్ర పాలకులు చిన్నచూ పు చూస్తూ అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రాంతం ఎంతో దగా కు గురైందన్నారు. తాను మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజుల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించానన్నారు.
ఆ సమయంలో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో పలువురి అభిప్రాయాలు సేకరించి వెనకబడిన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం నివేదిక తయారు చేశానన్నారు. తాను సమర్పిం చిన నివేదిక ఆధారంగానే వైఎస్సార్ జల యజ్ఞాన్ని ప్రారంభించారన్నారు.అదేవిధం గా ఈ రోజు సిద్ధం చేస్తున్న విజన్ ఆర్మూర్ నివేదికతో తెలంగాణలోనే ఆర్మూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.