నటి శ్రీవాణి వివాదం సుఖాంతం
వికారాబాద్: బుల్లితెర నటి శ్రీవాణి ఆస్తి తగాదా వ్యవహారం సుఖాంతమైంది. శ్రీవాణి వదిన అనూషకు న్యాయం చేస్తామని ఆమె కుటుంబ సభ్యులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అనూష అంగీకారంతో సీఐ నిర్మల సయోధ్య కుదిర్చారు.
శుక్రవారం పోలీసులు.. వాణి కుటుంబ సభ్యులను, అనూషను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనూషకు న్యాయం చేస్తామని వాణి కుటుంబ సభ్యులు చెప్పారు. అనూషకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కొంత గడువు కావాలని వాణి కుటుంబ సభ్యులు కోరారు. అనూష అంగీకారంతో కుటుంబసభ్యుల మధ్య రాజీకుదిరింది.
రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, శ్రీవాణి ఇంటి స్థలం విషయంలో గొడవకు దిగడంతో పాటు ఘర్షణ పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐ నిర్మల నిన్న వివాదాస్పద ఇంటి స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు.