రెండువేల మంది కార్యకర్తలు : టీడీపీకి షాక్
లేపాక్షి (అనంతపురం) : రెండు వేల మంది టీడీపీ కార్యకర్తలు టీడీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ అధికార పార్టీ నేతలు.. పోలీసు బలగాలను మోహరించి మరీ దిద్దుబాటుకు పూనుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లేపాక్షి మండలంలో టీడీపీకి చెందిన మల్లికార్జున్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు మరో 2 వేల మంది మల్లికార్జున్ అనుచరులు ఆయనతో సమావేశమయ్యేందుకు ఆదివారం ఆయన ఇంటికి చేరుకున్నారు.
అయితే నీటి సంఘం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదంటూ పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో వారు పోలీసులు, అధికార పార్టీ తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.