ముఖ రక్షణకు మాస్క్
- దుమ్ము, ధూళి, ఎండ నుంచి రక్షణ
- వివిధ మోడల్స్‌లో లభ్యం
విజయనగరం టౌన్: ప్రస్తుతం వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా వాహనాల నుంచి వచ్చే కాలుష్యం అంతా ఇంత కాదు. ఎండ, శీతాకాలంలో అరుుతే ద్విచక్ర వాహనచోదకులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఎండలో వెళ్తుంటే ముఖం కందిపోవడం, నల్లబడడం వంటి సమస్యలు వస్తుంటారుు. ఆస్తమా ఉన్న వారు దుమ్ము, ధూళి, పొగతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో దుమ్ము, ధూళితో పా టు ఎండల ధాటికి తట్టుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి.
ముఖ రక్షణకు మాస్క్‌లు ఎంతగానో ఉప యోగపడుతున్నారుు. ప్రస్తుత మార్కె ట్లో బైక్‌లపై వెళ్లే యువకులకు వారి అభిరుచికి తగ్గట్టుగా పేస్ మాస్క్‌లు లభ్యమవుతున్నాయి. వివిధ కంపెనీలు తయారు చేసిన పలు రకాల మో డళ్లతో కూడిన పేస్ మాస్క్‌లు యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నారుు. ద్విచక్ర వాహన చోదకుల మాస్క్‌లు ముఖాన్ని పూర్తిగా కాక కళ్లు, ముక్కు, చెవులను కప్పేందుకు మాత్రమే ఉపయోగపడతాయి.
ముఖానికి కర్చీఫ్ ధరించే వారికి ఇవి అనువుగా ఉంటాయి. మల్టీ పర్పస్ మాస్క్‌లు ఎనిమిది రకాలుగా ముఖాన్ని కప్పి ఉంచేందుకు దోహదపడతాయి. హాఫ్, పుల్, రౌండ్ తదితర రకాలుగా వినియోగించుకోవచ్చు. ఆగస్టా మాస్క్‌లు దుమ్ము, ధూళి నుంచి రక్షణ కల్పిస్తాయి. ఎక్కువ దుమ్ము ఉన్న ప్రదేశాల్లో, మట్టి రోడ్లపై ఇవి ఉపయోగపడతాయి. రైడర్ మాస్క్‌లు, నింజా, మల్టీ పర్పస్, బైకర్స్, ఆగస్టా, ఫేస్ సేఫ్, ఫేస్ రిచ్ వంటివి మాస్క్‌లు కూడా మార్కెట్లో అందుబా టులో ఉన్నాయి. ఫేస్ మాస్క్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రైడర్ మాస్క్‌లు రెండు రకాలుగా లభ్యమవుతున్నాయి.
సింగిల్ కలర్, మల్టీకలర్ లో లభ్యమవుతున్న సాఫ్ట్ క్లాత్‌తో తయారు చేస్తుండడంతో ధరించే వారికి అనువుగా ఉంటున్నాయి. రూ. 200 నుంచి రూ. 300 వరకూ మోడల్ బట్టి మాస్క్‌ల ధర ఉంటుంది. పైబర్ క్లాత్‌తో తయారుచేసిన నింజా మాస్క్‌లు ముఖానికి నిండుగా ఉంటాయి. దళసరిగా ఉండడంతో చలి, మంచు నుంచి రక్షణ కల్పిస్తారుు. ముఖాన్ని పూర్తిస్థారులో ప్యాక్ చేసినట్టు ఉండే మాస్క్‌లు ధర రూ. 175 వరకు ఉంది. దుమ్ము , ధూళి ముక్కులోకి వెళ్లకుండా ఉండేందుకు ఆగస్టా మాస్క్‌లకు ప్లాస్టిక్ మూత ఉంటుంది. యువత ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.