two years baby
-
రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి..
హైదరాబాద్ : రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పాప నిద్రపోవడంతో కారులోనే ఉంచి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. అయితే రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో చిన్నారి ఉండటాన్ని స్థానికులు గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు కారు అద్దాలు మూసి ఉండటంతో పాటు తల్లిదండ్రులు కనిపించకపోవడంతో చిన్నారి ఏడుపు మొదలుపెట్టింది. దీంతో పోలీసులు స్థానికుల సాయంతో అతికష్టం మీద కారు అద్దాలు పగులగొట్టి పాపను బయటకు తీశారు. పాప క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అశ్రద్ధగా చిన్నారిని వదిలివెళ్లిన తల్లిదండ్రులపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, నిద్రపోయిన పాపను లేపడం ఇష్టం లేకే కారులో ఉంచి వెళ్లామని వారు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ స్థానికులు వారి చర్యపై వారి చర్యపై మండిపడ్డారు. -
రెండేళ్ల కూతురిని హాట్ ఓవెన్‌పై పెట్టి..
న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్‌లో హాచర్ (35) అనే ఓ తల్లి మాతృత్వానికి మచ్చ తెచ్చేచర్యకు పాల్పడింది. చక్కగా ముద్దులొలికే మాటలు పలుకుతూ, వడివడిగా అడుగులు వేసే తన చిన్నారిని ఆడించాల్సిందిపోయి హాట్ ఓవెన్‌పై పెట్టింది. దీంతో ఆ పాపకు తీవ్ర గాయాలయ్యాయి. పాప ఏడుపు విని చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పాపను తొలుత టెక్సాస్ లోని మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్పించి అనంతరం డల్లాస్ లోని పార్క్ లాండ్ బర్న్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతానికి ఆ బాలిక ఆరోగ్యం స్థిమితంగానే ఉందని ఒకప్పుడు హ్యాచర్దగ్గర పనిచేసిన మహిళ ఒకరు చెప్పారు. అయితే హాచర్ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై మాత్రం వివరాలు తెలియరాలేదు. కొద్ది రోజుల కిందట నాలుగేళ్ల బాలుడిని ఇదే ప్రాంతంలో సవతి తల్లి వేడి నీళ్లలో పెట్టడంతో అతడు తీవ్రగాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరోసారి చోటుచేసుకోవడం అధికారులు సీరియస్ గా ఉన్నారు. -
బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి