tyagam
-
సోనియా త్యాగంతోనే తెలంగాణ వచ్చింది
లక్డీకాపూల్ (హైదరాబా ద్): సోనియా గాంధీ త్యాగంతోనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని దివంగత ప్రజాగాయకుడు గద్దర్ సతీమణి విమల అన్నారు. ఆమె త్యాగనిరతి ఏంటో తనకు తెలుసని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోనియా గాంధీ ఆదివారం గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా తాను బస చేసిన తాజ్ కృష్ణా హోటల్‌కే విమలను పిలిపించుకున్నారు.ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం గద్దర్ చేసిన పోరాటాలను కొనియాడారు. రాహుల్ స్పందిస్తూ.. గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియా, ప్రియాంకలకు చెప్పారు. ఆయన గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విమల మీడియాతో మాట్లాడు తూ.. త్యాగమంటే ఏంటో సోనియాకు తెలు సు కాబట్టే ఆమెను కలవాలనుకున్నానని చెప్పారు. ఆ త్యాగం కేసీఆర్‌కు తెలియదని, ఆయన నిరాహార దీక్షలతో తెలంగాణ సిద్ధంగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని విమల స్పష్టం చేశారు. -
విద్యార్థుల త్యాగాలు మరిచిన ప్రభుత్వం
కరీంనగర్ : ప్రభుత్వం విద్యార్థుల త్యాగాలను మరిచి స్వార్థ రాజకీయాల ప్రభుత్వం వ్యవహరిస్తుందని రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు సూకురి అశోక్ మండిపడ్డారు. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడు కెంసారం సాయికృష్ణ, లింగంపల్లి పవన్‌కల్యాణ్, ధీరజ్, శంకర్, అరుణ్‌కుమార్, కమలాకర్, శివ, సాయి, ప్రవీణ్, అమృత్‌సింగ్, అక్షయ్, అంజయ్య, సయ్యద్ ఇస్రఫ్, యూసుఫ్, పవన్ పాల్గొన్నారు.