'రైతుల ఆపద్బాంధవుడు వైఎస్ జగన్'
గుంటూరు: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గు లేదని.. డబ్బు పదవులకు ఆశపడే వారు బాబు పంచన చేరారని విమర్శించారు. ముఖ్యమంత్రి తీరును సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారన్నారు.
మంగళవారం రైతు దీక్షా వేదిక వద్ద మాట్లాడిన నారాయణ స్వామి.. చంద్రబాబు పేదలకు ఒక్క ఇల్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, దళితుల పట్ల శత్రుత్వం పెంచుకున్నారని అన్నారు. గతంలో వైఎస్ఆర్ అన్నివర్గాలకు మేలు చేశారని గుర్తుచేశారు. రైతుల ఆపద్బాంధవుడు వైఎస్ జగన్ అని నారాయణస్వామి కొనియాడారు.