Udupi flavor
-
ఇంట్లో ఇవి ఉంటే చాలు.. రుచికరమైన, ఆరోగ్యానిచ్చే ఉడిపి సాంబార్ రెడీ!
రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►కందిపప్పు – అరకప్పు (కడిగి అరగంటసేపు నానబెట్టాలి) ►పసుపు– అర టీ స్పూన్ ►ఉప్పు– రుచికి తగినంత ►బీరకాయ ముక్కలు– 300 గ్రాములు ►టొమాటో ముక్కలు – కప్పు. సాంబార్ పేస్ట్ కోసం: ►మినప్పప్పు– టేబుల్ స్పూన్ ►గుంటూరు మిర్చి– 8 ►పొట్టి మిరపకాయలు – 6 ►ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు ►యాలకులు – 2 ►లవంగాలు – 3 ►దాల్చిన చెక్క– అంగుళం ముక్క ►జీలకర్ర – టీ స్పూన్ ; పచ్చి కొబ్బరి ముక్కలు– అర కప్పు ; గసగసాలు– టీ స్పూన్. సాంబార్ పోపు కోసం: ►నూనె : టేబుల్ స్పూన్ ►మెంతులు – చిటికెడు ►ఆవాలు– అర టీ స్పూన్ ►ఇంగువ పొడి – చిటికెడు ►కరివేపాకు– 2 రెమ్మలు ►చింతపండు– 70 గ్రాములు (300 మి.లీ రసం చేయాలి) ►నీరు– ముప్పావు లీటరు ►ఉప్పు – తగినంత. గార్నిష్ చేయడానికి: ►నూనె – 2 టీ స్పూన్లు ►వేరుశనగ పప్పు – 4 టేబుల్ స్పూన్లు ►ఆవాలు – అర టీ స్పూన్ ►ఎండు మిర్చి– 2 ►కొత్తిమీర తరుగు – కప్పు తయారీ: ►కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, పసుపు వేసి ఉడికించాలి. ►చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ►మందపాటి బాణలి వేడి చేసి సాంబార్ పేస్టు కోసం తీసుకున్న దినుసులను సన్నమంట మీద వేయించి చల్లారిన తరవాత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. ►బీరకాయ ముక్కల్లో కొద్దిగా నీటిని చిలకరించి మీడియం మంట మీద ఒక మోస్తరుగా ఉడికించాలి. ►మరీ మెత్తగా ఉడకకూడదు. ►మందపాటి పాత్రలో నూనె వేడి చేసి పోపు కోసం తీసుకున్న దినుసులను వేసి వేయించి టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ►తర్వాత చింతపండు రసం పోసి కలిపి అందులో సాంబార్ పేస్ట్, బీరకాయ ముక్కలు, కందిపప్పు పేస్ట్ వేసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ►చిన్న బాణలిలో నూనె వేసి గార్నిష్ చేయడానికి తీసుకున్న దినుసులను వేయించి ఉడుకుతున్న సాంబార్లో వేసి దించేయాలి. ►ఇది అన్నంలోకి చక్కటి రుచినిస్తుంది. రోటీ చపాతీల్లోకి చేసేటప్పుడు నీటి మోతాదు తగ్గించుకుని చిక్కగా చేసుకోవాలి. చదవండి: Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్ -
తెలుగు రాష్ట్రాల్లో ఉడిపి రుచి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీ టు ఈట్ ఉత్పత్తుల విపణిలో ఉన్న ఉడిపి రుచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవేశించింది. బ్రేక్‌ఫాస్ట్, రైస్, మీల్ మిక్సెస్, స్పైస్ మిక్సెస్, హెల్త్ డ్రింక్స్ వంటి 100కుపైగా ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. ఇప్పటి దాకా కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో అమ్మకాలు సాగించామని ఉడిపి రుచి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న శ్రీ ఫ్యామిలీ గ్రూప్ డైరెక్టర్ ఎస్.ఆర్.రావు సాహిబ్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక డ్రై బ్లెండ్ టెక్నాలజీతో బెంగళూరులో తయారీ కేంద్రం నెలకొల్పినట్టు చెప్పారు. రసాయనాలు కలపకుండా ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు తెలిపారు. పరిశోధన, అభివృద్ధికి రూ.20 కోట్ల వ్యయం చేశామన్నారు. క్లబ్ మహీంద్రా, ఓబెరాయ్, లావజ్జా, స్పార్ సూపర్ మార్కెట్లకు ప్రొడక్టులను సరఫరా చేస్తున్నామన్నారు. రెడీ టు ఈట్ ఉత్పత్తులతో.. శ్రీ ఫ్యామిలీ గ్రూప్ బెంగళూరు, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌లో కెఫే ఉడిపి రుచి రెస్టారెంట్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. వీటిలో రెడీ టు ఈట్ ఉత్పత్తులతోనే ఆహార పదార్థాలను అందిస్తారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కొద్ది రోజుల్లో ఈ ఔట్లెట్ రానుంది. దేశవ్యాప్తంగా మూడేళ్లలో ఫ్రాంచైజీ విధానంలో 300 కెఫేలను నెలకొల్పుతామని రావు సాహిబ్ వెల్లడించారు. ‘50 కేంద్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తాం. కియోస్క్, రెస్టారెంట్, హైవే మోడల్స్‌లో ఇవి రానున్నాయి. మోడల్‌నుబట్టి రూ.12 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు పెట్టుబడి అవసరం. ఫుడ్ తయారీ నిపుణులను నియమిస్తాం’ అని వివరించారు. గ్రూప్‌లో తొలి కంపెనీ నూతచ్ న్యూట్రికేర్ టెక్నాలజీస్‌ను లలిత రావు సాహిబ్ 1999లో రూ.30 వేల పెట్టుబడితో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్ రూ.70 కోట్ల టర్నోవరు, 180 మంది సిబ్బందితో విస్తరిస్తోంది.