పశ్చిమలో విద్యార్థి గర్జన
సమైక్యాంధ్ర ఉద్యమం పశ్చిమగోదావరి జిల్లాలో మరింత ఉధృతంగా సాగుతోంది.సమైక్యాంధ్రకు మద్దతుగా ఏలూరు నగరంలోని అన్ని పాఠశాలల విద్యార్థులతో కలసి విద్యార్థి గర్జనను నిర్వహిస్తున్నారు. అలాగే అదే జిల్లాలోని కోవ్వూరులో ఉగ్ర గోదావరి లక్షజన గళ గర్జన ఏర్పాటు చేయనున్నారు.
అలాగే తణుకు పట్టణంలో కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు చేపట్టిన ఆందోళనగానే కేబులు ప్రసారాలను నిలిపివేశారు. అయితే జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్ని డిపోలకే పరిమితమైనాయి. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూసివేశారు.