నవ్వులే నవ్వులు...
‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటులు ముఖ్యపాత్రల్లో ‘బంతిపూల జానకి’ చిత్రం తెరకెక్కుతోంది. ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో శ్రీమతి కల్యాణి రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ విడుదల చేశారు. ‘‘సరికొత్త జానర్ లో సాగే చిత్రం ఇది. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అని నటుడు ధన్‌రాజ్ అన్నారు. దీక్షాపంత్, మౌనిక, ‘షకలక’ శంకర్, ‘చమ్మక్’ చంద్ర, ‘సుడి గాలి’ సుధీర్, ‘రాకెట్’ రాఘవ, ‘అదుర్స్’ రఘు నటిస్తున్నారు.