uk airlines
-
కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్, యూరప్ దేశాల మధ్య అత్యధిక పౌర విమాన సర్వీసులను నడుపుతున్న అతి పెద్ద ప్రాంతీయ విమాన సర్వీసుల సంస్థ ‘ఫ్లైబీ’ గురువారం నాడు కుప్పకూలి పోయింది. ఇంకేమాత్రం విమాన సర్వీసులను నడపలేమంటూ చేతులు ఎత్తేసింది. ఫలితంగా యూరప్ అంతటా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుబడి పోయారు. ఎలా గమ్యస్థానాలకు వెళ్లాలో తెలియక వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విమాన సంస్థ చేతులెత్తేసిన కారణంగా రెండు వేల మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గతంలో మోనార్క్ ఏర్‌లైన్స్, థామస్ కుక్ ఏర్‌లైన్స్ ఇలాగే కుప్పకూలిపోయినప్పుడు యూరప్‌లో చిక్కుబడి పోయిన ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చాల్సిందిగా పౌర విమానయాన అధికార యంత్రాంగాన్ని బ్రిటన్ రవాణా శాఖ ఆదేశించింది. 2017లో మోనార్క్ ఏర్‌లైన్స్ మూత పడినప్పుడు వివిధ విమానాశ్రయాల్లో చిక్కుబడి పోయిన ప్రయాణికులను చేరవేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం 60 మిలియన్ పౌండ్ల డబ్బుతో బ్రిటన్ ప్రభుత్వం అద్దె విమానాలను నడిపింది. థామస్ కుక్ ఏర్‌లైన్స్ మూత పడినప్పుడు ప్రయాణికుల చేరవేతకు అంతకన్నా ఎక్కువ ఖర్చయినట్లు తెల్సింది. (చదవండి : దుబాయ్‌లో భారతీయ విద్యార్థికి కరోనా) రద్దయిన విమానాల ప్రయాణికుల ఖర్చును కొన్ని బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అన్ని పాలసీలు ఒకేలా ఉండవు కనుక అన్ని రద్దయిన విమానాల చార్జీలను అవి భరించలేవు. హాలీడే మేకర్స్ మాత్రం తమ ప్రయాణికుల చార్జీలను డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించగలవు. విమాన టిక్కెట్లతోపాటు హోటల్ రూమ్‌లు, కారు సర్వీసులను ప్యాకేజీ డీల్ కింద అందజేసే హాలీడే మేకర్స్ మాత్రం ప్రయాణికుల టిక్కెట్ చార్జీలీను వెనక్కి చెల్లించగలవు. (చదవండి : అమెజాన్, ఫేస్‌బుక్‌కు కరోనా సెగ ) జనవరి నుంచి నష్టాలను చవి చూస్తున్న ‘ఫ్లైబీ’ పౌర విమానయాన సంస్థ కరోన వైరస్ కారణంగా నష్టాలు విపరీతంగా పెరగడంతో గత రాత్రి మూసివేతను ప్రకటించింది. అనివార్యమైన ఈ పరిస్థితికి తీవ్రంగా చింతిస్తున్నామంటూ ఫ్లైబీ సీఈవో మార్క్ ఆండర్సన్ సిబ్బందికి రాసిన ఓ లేఖలో విచారం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా పర్యాటక ప్యాకేజీలు లేకపోవడం, వ్యాపారస్థుల పర్యటనలు భారీగా పడిపోవడంతో బ్రిటిష్ ఏర్వేస్, వర్జిన్ అట్లాంటిక్ సహా పలు అంతర్జాతీయ విమాన సర్వీసుల సంస్థ లగ్జరీ క్లాస్ టిక్కెట్లను 60 శాతం తగ్గించి నడుపుతున్నాయి. కరోనా భయాందోళనలు ఇలాగే కొనసాగితే వాటి మనుగడకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. (చదవండి : కోడికి కరోనా బూచి) -
సంక్షోభంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్, విమానాలన్నీ రద్దు
లండన్ : యూకేలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ మోనార్క్ సంక్షోభంలో కూరుకుపోయింది. సోమవారం నుంచి మోనార్క్ ఎయిర్‌లైన్స్ తన సేవలను నిలిపివేసింది. 3 లక్షల బుకింగ్స్‌ను కూడా ఈ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. దీంతో విదేశాల్లో ఉన్న మోనార్క్ విమాన ప్రయాణికులు ఇరకాటంలో పడిపోయారు. విదేశాల్లో చిక్కుకుపోయిన లక్షకు పైగా మోనార్క్ ప్రయాణికులను జాగ్రత్తగా తిరిగి స్వదేశానికి తీసుకురావాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ)ని బ్రిటీష్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వారిని వెనక్కి తీసుకురావడానికి సీఏఏ 30కి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధం చేసింది. మోనార్క్ విమానాలను, హాలిడేస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం విచారకరమంటూ మోనార్క్ ట్విట్టర్ తన ద్వారా తన సేవల నిలిపివేతను ప్రకటించింది. మోనార్క్ ప్రయాణికులు విమానశ్రయాలకు వెళ్లాల్సినవసరం లేదని, అక్కడ విమానాలు లేవంటూ పేర్కొంది. మోనార్క్ తీసుకున్న ఈ నిర్ణయం తన కస్టమర్లపై, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీఏఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రూ హైన్స్ చెప్పారు. యూరోపియన్ ఎయిర్‌లైన్స్‌తో తీవ్రకరమైన పోటీ, డ్రైవింగ్ కన్సాలిడేషన్ వంటి పలు కారణాలచే మోనార్క్ సేవలు స్తంభించిపోయాయి. మోనార్క్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా యూజర్లు సైతం విరుచుకు పడుతున్నారు. మోనార్క్‌కు ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని మోనార్క్ దివాలాపై నియమింపబడ్డ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ చెప్పింది. -
యూకే ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పేరిట బురిడీ
ముంబైలో సూత్రధారిని అరెస్ట్ చేసిన సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ‘యూకే ఎయిర్‌లైన్స్‌లో మంచి ఉద్యోగం ఉంది. మీ వివరాలు పంపిస్తే ఆఫర్ లెటర్, జాబ్ ఆర్డర్ కాపీలు పంపిస్తాం’ అంటూ ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని సూత్రధారిని రాష్ట్ర సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2010లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో ఉద్యోగాన్వేషణ చేస్తుండగా ముంబైలోని వెస్ట్ అంధేరీకి చెందిన నితిన్ రామ్‌విలాస్ ప్రసాద్ తన స్నేహితుడు సంజీవ్ బోసే, ఒక నైజీరియన్తో కలసి అతన్ని ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పేరిట బురిడీ కొట్టించారు. అతన్నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ.10.70 లక్షలు కొల్లగొట్టారు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు...గతంలోనే నలుగురు ఇతర నిందితులను అరెస్టు చేశారు. అయితే ఆరేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నితిన్ రామ్‌విలాస్ ప్రసాద్‌ను సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ బృందం ముంబైలో తాజాగా అరెస్ట్ చేసింది. ఈ ముఠా యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో అనేక మందిని ఇలాగే మోసగించి డబ్బులు వసూలు చేసినట్టు దర్యాప్తులో తెలిసిందని సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. లాటరీలు, స్వచ్ఛంద సంస్థలు, చారిటీలు, ఆన్లైన్ ఉద్యోగ ప్రకటనలు, వర్క్ ప్రమ్ హోం తదితర సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మిమోసపోవద్దని, ఇలాంటి సందేశాలు మొబైల్ ఫోన్లకు వస్తే cybercrimesps@cid.tspolice.gov.in కు ఫిర్యాదు చేయాలని సీఐడీ ఐజీ తెలిపారు.