యూకే స్టీల్ వ్యాపార విక్రయం బాధ్యతాయుతంగా జరగాలి
లండన్: టాటా గ్రూప్ తన యూకే స్టీల్ వ్యాపారాన్ని త్వరితగతిన విక్రయించడానికి సన్నద్దమవ్వడాన్ని జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) కార్మికులు తప్పుబట్టారు. స్టీల్ వ్యాపార విక్రయం మొత్తం సంస్థ రూపంలో బాధ్యతాయుతంగా జరగాలని, నమ్మదగిన కొనుగోలుదారు లభించే వరకు వేచి ఉండాలని బ్రిటన్, ఐర్లాండ్‌లోని అతిపెద్ద ట్రేడ్ యూనియన్ ‘యునైట్’.. సైరస్ మిస్త్రీకి ఉత్తరం ద్వారా తెలియజేసింది. టాటా గ్రూప్ తన యూకే వ్యాపార విక్రయాలను వెంటనే ఇతరులకు విక్రయించాలని చూస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొంది.