Umang Bedi
-
రూ.14 కోట్ల జాబ్‌కు ఎవరూ ముందుకురారే...
న్యూఢిల్లీ : ఫేస్బుక్, వాట్సాప్ ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు భారత్ చాలా పాపులర్. యువత ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా దిగ్గజాలను వాడుతుంటారు. ఈ రెండింటికి కలిపి భారత్‌లో 57 కోట్లకు పైగానే యూజర్లు ఉన్నారు. అంటే అమెరికా కంటే భారత్‌లోనే ఈ ప్లాట్‌ఫామ్‌లకు యూజర్లు ఎక్కువ. ఇంత ఫేమస్ అయిన ఈ కంపెనీల్లో టాప్ పోస్టును అలకరించడానికి సీనియర్-లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. కానీ భారత్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఫేస్బుక్, వాట్సాప్‌లకు భారత్‌లో అధినేతలు దొరకడం లేదు. దొరకడం లేదు కాదు, ఎవరూ ఈ పదవిని అలంకరించడానికి ముందుకు రావడం లేదు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ఇటీవల భారత్‌లో ఆంక్షలు పెరిగిపోయాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నకిలీ న్యూస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని, ఈ వార్తలతో బాగా మూకదాడులు జరుగుతున్నాయంటూ.. ప్రభుత్వం ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకు కఠిన హెచ్చరికలే జారీ చేసింది. అంతేకాక ఈ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన ఆంక్షలే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ కంపెనీలకు టాప్ ప్రతినిధులు దొరకడం లేదు. ఫేస్బుక్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటున్న ఉమాంగ్ బేడి 2017 అక్టోబర్‌లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెటింగ్ సొల్యుషన్స్ హెడ్ సందీప్ భూషణ్ ఆ పదవిని తాత్కాలికంగా అలకరించారు. కానీ కొత్త వారిని నియమించడం ఆ కంపెనీకి కష్టంగా మారింది. ఎండీ పదవి, వైస్-ప్రెసిడెంట్ పోస్ట్‌తో సమానం. అంటే స్టాక్ ఆప్షన్లతో కలిపి, వార్షికంగా రూ.14 కోట్లకు పైగా పరిహారాలు పొందుతారు. కానీ కోట్లు ఆఫర్ చేస్తున్న భారత్‌లో ఈ కంపెనీలకు ఎండీ పదవిని చేపట్టేందుకు ఏ సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్ ముందుకు రావడం లేదని తెలిసింది. ఫేస్బుక్ ప్రస్తుతం స్టార్ ఇండియా ఎండీ సంజయ్ గుప్తా, టాటా స్కై ఎండీ హరిత్ నాగ్‌పాల్, హాట్‌స్టార్ సీఈవో అజిత్ మోహన్ల పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో ఒకరిని ఖరారు చేయాలని ఫేస్బుక్ భావిస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచిచూడాలి. అంతేకాక, ఫేస్బుక్లో మొత్తంగా డజనుకు పైగా సీనియర్-లెవల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు వాట్సాప్‌కు కూడా భారత్ హెడ్‌ను నియమించడం క్లిష్టంగా మారింది. ఇప్పటికే వాట్సాప్‌లో తప్పుడు సమాచారంతో బాగా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం మండిపడుతోంది. వాట్సాప్ ఇప్పటి వరకు భారత్‌లో ఎందుకు గ్రీవియెన్స్ ఆఫీసర్ నియమించలేదో సమాచారం చెప్పాలంటూ ప్రభుత్వానికి, ఆ కంపెనీకి సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. -
ఫేస్బుక్ ఇండియా ఎండీ పదవికి గుడ్‌బై
ఫేస్బుక్ ఇండియా సీఈవో, ఎండీ పదవికి ఉమాంగ్ బేడి గుడ్‌బై చెప్పారు. గతేడాది జూన్‌లో ఈ సోషల్ మీడియా కంపెనీకి సీఈవోగా నియమింపబడ్డ ఉమాంగ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం కంపెనీ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్‌గా సందీప్ భూషణ్ ఎంపికయ్యారు. భూషణ్ అంతకముందు శాంసంగ్ ఐటీ, మొబైల్ బిజినెస్‌కు మాజీ డైరెక్టర్. ఉమాంగ్ బేడీ రాజీనామాను ఫేస్బుక్ ఇండియా ధృవీకరించింది. ఉమాంగ్ బేడీ ఈ ఏడాది చివర్లో ఫేస్బుక్ నుంచి వెళ్లిపోతున్నారని తెలిపింది. తమతో పనిచేసినంత కాలం ఆయన బలమైన టీమ్‌ను, వ్యాపారాన్ని ఏర్పాటుచేశారని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు. అడోబ్ దక్షిణాసియా ప్రాంతానికి ఎండీగా ఉన్న ఉమాంగ్ బేడీని ఫేస్బుక్ గతేడాది తన కంపెనీలోకి చేర్చుకుంది. దేశంలోని టాప్ క్లయింట్లు, రీజనల్ ఏజెన్సీలతో వ్యూహాత్మక సంబంధాలను ఆయన ఏర్పాటుచేశారు. అడోబ్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే రకమైన పనితీరు కనబర్చి దేశంలోనే దిగ్గజ మార్కెట్లలో ఒకటిగా భారత్‌ను చేర్చారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి అతిపెద్ద మొత్తంలో ఆడియన్స్ కలిగిన దేశంగా భారత్ ఉంది. 240 మిలియన్ మార్కును ఫేస్బుక్ అధిగమించింది. జూలై 13న భారత్‌లో తమకు 241 మిలియన్ల యాక్టివ్ యూజర్లున్నట్టు ఫేస్బుక్ రిపోర్టు చేసింది. -
ఫేస్ బుక్ ఇండియాకు కొత్త ఎండీ
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కు భారత కార్యకలాపాలకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేశారు. మాజీ అడోబ్ ఎగ్జిక్యూటివ్ ఉమంగ్ బేడీని కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా ఫేస్ బుక్ నియమించుకుంది. జూలై నుంచి బేడీ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ లోని టాప్ క్లైయింట్స్ తో, స్థానిక ఏజెన్సీలతో వ్యూహాత్మక సంబంధాలు పెంచుకోవడంలో ఆయన తోడ్పడనున్నారని ఫేస్ బుక్ వెల్లడించింది. ఇప్పటివరకూ భారత ఫేస్ బుక్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న కార్తీక రెడ్డి నుంచి త్వరలోనే బేడీ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉమంగ్ బేడీకి బాధ్యతలు అప్పగించిన వెంటనే కార్తీక రెడ్డి అమెరికాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం మెల్నో పార్క్ లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. అడోబ్ దక్షిణా ఆసియా ప్రాంతానికి బేడీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన బేడీ, అక్కడ పదవికి రాజీనామా చేసి.. ఫేస్ బుక్ లో చేరిపోయారు. టాలెంట్ సముదాయానికి గుర్తింపుగా భారత్ వర్థిల్లుతుందని, ఉమెంగ్ బేడిని భారత మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించుకోవడంలో తాము సంతోషిస్తున్నామని ఫేస్ బుక్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ డాన్ నియరి తెలిపారు. ఇండియాలో ఫేస్ బుక్ వ్యాపారాలను లీడ్ చేస్తూ బెస్ట్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా ఉమంగ్ నిలుస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అమెరికా తర్వాత ఫేస్ బుక్ కు అతిపెద్ద మార్కెట్ భారత్ లోనే ఉంది. భారత్ లో 150 మిలియన్ ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.