చెరువులో పడి పశువుల కాపరి మృతి
మంగపేట : మండల కేంద్రంలోని గంపోనిగూడేనికి చెందిన మేకల మల్లయ్య(80) అనే పశువుల కాపరి ఉమ్మన్నకుంట చెరువులో పడి సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై ననిగంటి శ్రీకాం త్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీగా మల్లయ్య పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈక్రమంలో కొన్ని గేదెలు కనిపించకపోవడంతో వాటిని వెతుకుతూ ఉమ్మన్నకుంట చెరువు సమీపంలోకి వెళ్లాడు. చెరువులో ఉన్న గేదెలను బయటికి వెళ్లగొట్టే క్రమంలో నీటిలో మునిగి మృతిచెందాడు. మంగళవారం ఉదయం గ్రామస్తులు చెరువులో మల్లయ్య మృతదేహాన్ని గుర్తిం చారు. మృతుడి కుమారుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.