స్నేహ, సంగీతలకు డబుల్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నిర్వహిస్తోన్న వేసవి శిబిరాల జిమ్నాస్టిక్స్ అండర్–12 పోటీల బాలికల విభాగంలో వీఎన్సీకి చెందిన స్నేహ విజేతగా నిలిచింది. శనివారం విజయనగర్ కాలనీలో జరిగిన ఫ్లోర్ ఎక్సర్సైజ్, టేబుల్ వాల్ట్ విభాగాల్లో స్నేహ విజేతగా నిలిచింది. రెండు పోటీల్లోనూ భానుశ్రీకి రజతం, అలేఖ్యకి కాంస్యం దక్కాయి. అండర్–11 బాలికల విభాగంలో సంగీత రెండు స్వర్ణాలు అందుకోగా.. యశ్ని రజతాలు కైవసం చేసుకుంది. అండర్ 5–9 బాలబాలికలకు ఫ్లోర్ ఎక్సర్సైజ్లు, అండర్ 10–16 మధ్య వారికి ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌తో పాటు టేబుల్ వాల్ట్ విభాగంలోనూ పోటీలు నిర్వహించారు. విజేతలకు విజయనగర్ కాలనీ కార్పొరేటర్ సల్మా అమీన్, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం జనరల్ సెక్రటరీ మహేశ్వర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ, హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం సెక్రటరీ విజయ్‌పాల్ రెడ్డి, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమేశ్, సీనియర్ నేషనల్ జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రహ్మానంద ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఇతర విజేతల వివరాలు
అండర్–5 బాలురు: వెంకట్ సాయి, వైష్ణవ్, ఇషాన్ దేవ్; బాలికలు: మేఘన, రుమైల రెహమాన్, అద్విక. అండర్–6 బాలురు: వీర్, సాయి వెంకట నవదీప్, తావిశ్; బాలికలు: సహస్ర, వంశిక, ప్రసన్న. అండర్–8 బాలురు: అంగద్, రామ్ (అమీర్‌పేట్), రాంచరణ్; బాలికలు: రిధి, ఖుషి, వైష్ణవి. అండర్–9 బాలురు: తేజ కుమార్, చేతన్ సాయి, కార్తీక్; బాలికలు: దియా, నిహారిక, సింధు. అండర్–10 బాలురు (ఫ్లోర్ ఎక్సర్సైజ్, టేబుల్ వాల్ట్): వివేక్, పవన్, మణిరాజ్; బాలికలు: ఫ్లోర్ ఎక్సర్సైజ్: స్నిగ్థ, దీపిక, అఖిల; టేబుల్ వాల్ట్: ప్రీతి, భవాని, దీపిక; అండర్–11 బాలురు: ఫ్లోర్ ఎక్సర్సైజ్– తనుష్ రాజ్, శివ శంకర్, సంతోష్; టేబుల్ వాల్ట్– కార్తీక్, హరీశ్, అబ్దుల్ రబ్బాని.