జీఎస్టీ బిల్లుపై అవగాహన పెంచుకోవాలి
కోదాడఅర్బన్ : దేశంలో ఒకే రకమైన పన్ను విధానాన్ని అవలంబించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుపై కామర్స్ విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని రిటైర్డ్ అధ్యాపకులు మంత్రిప్రగడ భరతారావు, ప్రముఖ అకౌంటెంట్ శేషుప్రసాద్లు కోరారు. జీఎస్టీ బిల్లుపై మంగళవారం కోదాడ పట్టణంలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో కామర్స్ విద్యార్థులకు నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. వస్తు సేవల పన్నులకు సంబంధించిన విషయాలను శేషుప్రసాద్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సైదేశ్వరరావు, ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.