unemployed issues
-
మోదీకి ఊహించని షాక్.. ఒవైసీకి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎంపీ.. సొంత పార్టీ బీజేపీపైనే సంచలన విమర్శలు చేశారు. దీంతో దేశంలోనే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. కేంద్రానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. భారత్‌లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్ అంటూ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగితేనే దేశం శక్తివంతం అవుతుందని కుండబద్దలుకొట్టారు. ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉన్నారని అన్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొద్దిరోజుల కిత్రం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను వెల్లడించారు. ఈ సందర్బంలో తాను చదవి వినిపించిన డేటా తనది కాదని.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీదని తెలిపారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి తన డేటాను చదవి వినిపించిన అసదుద్దీన్ ఒవైసీకి వరణ్ గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा। मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ — Varun Gandhi (@varungandhi80) June 13, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ -
9న రాష్ట్రానికి రాహుల్!
* ఓయూలో పర్యటన అనుమానమే * విద్యార్థి సంఘాల మధ్య విభేదాలే కారణం సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సెప్టెంబరు 9న రాష్ట్రానికి రానున్నట్టుగా టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. అయితే ఆయన ఉస్మానియా వర్సిటికీ వెళ్తారా లేదా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక, ఓయూలో విద్యార్థి సదస్సులో పాల్గొనడానికి రాహుల్ ఆగస్టు మొదటి వారంలోనే రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే జాతీయ రాజకీయ పరిణామాలు, భూసేకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ వంటి వాటి వల్ల పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఆ పర్యటన సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఉండే అవకాశాలున్నట్టుగా ఏఐసీసీ వర్గాల నుంచి సూత్రప్రాయ సమాచారం అందినట్టుగా టీపీసీసీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నికలు, నగర పాలకవర్గ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి రాహుల్‌తో పర్యటన చేయిం చాలని టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసింది. కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ గత ఎన్నికల్లోని పరాభవం వల్ల వచ్చిన నైరాశ్యం పోగొట్టేందుకు, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు రాహుల్ పర్యటనను వాడుకోవాలని వారు భావిస్తున్నారు. వరంగల్ జిల్లా పార్టీ నేతల మధ్య విభేదాలు పోగొట్టేందుకు లోక్‌సభ పరి ధిలోని నియోజకవర్గాల నాయకులతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతోపాటు మైనారిటీలు, దళితులతోనూ ఆయన సమావేశం కానున్నారు. విద్యార్థుల్లో విభేదాలపై రాహుల్‌కు మెయిల్స్ తెలంగాణలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొనాలంటూ పలువురు విద్యార్థి నేతలు ఇప్పటికే రాహుల్‌ను కలిశారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఓయూలో ఆయనతో సమావేశం ఏర్పాటు చేయించేందుకు టీపీసీసీ కూడా ఉత్సాహంగా ఉంది. అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు ఉన్నట్టుగా రాహుల్‌గాంధీకి మెయిల్ ద్వారా, ఫ్యాక్సుల ద్వారా ఫిర్యాదులు అందాయి. విద్యార్థి సంఘాల మధ్య విబేధాలు రాహుల్ పర్యటనపై ప్రభావం చూపినా, కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరిగినా జాతీయవ్యాప్తంగా దుష్ర్పభావం ఉంటుందని కొందరు నేతలు వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఓయూలో రాహుల్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి.