జాతీయ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ
సాక్షి, హైదరాబాద్: అస్పృశ్యత నివారణకు క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేస్తున్న వారితో పాటు షెడ్యూల్ కులాల వారిపై జరుగుతున్న నేరాలు, అకృత్యాలపై పోరాడుతున్న వ్యక్తులు, సంస్థల పేర్లను సూచిస్తూ జాతీయ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా రాష్ట్రాన్ని కేంద్రం కోరింది.
ఈ అంశాలపై 2010-14 మధ్య కాలంలో కృషి చేసిన వ్యక్తులు, సంస్థల వివరాలతో ఈ నెల 31లోగా సీఎం ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ నుంచి రాష్ర్ట ప్రభుత్వానికి శుక్రవారం లేఖ అందింది. అవార్డు నియమ నిబంధనలను తమ శాఖ వెబ్సైట్లో చూడవచ్చని లేఖలో కేంద్రం తెలిపింది.