బెంగాల్ వర్సిటీ వెబ్ సైట్ హ్యాక్
కోల్ కతా: పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ యూనివర్సిటీ వెబ్ సైట్ ను యునైటెడ్ ఇస్లామిక్ సైబర్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ హ్యాక్ చేసింది. దీంతో దాని నుంచి బయటపడేందుకు ఇప్పుడు వర్సిటీ అధికారులు తంటాలుపడుతున్నారు. కూక్ బెహర్ లోని నార్త్ బెంగాల్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అధికారిక వెబ్ సైట్ ఆదివారం ఉదయం హ్యాకింగ్‌కు గురైంది. దీనిపై వర్సిటీ అధికారులు మాట్లాడుతూ హోమ్ పేజీ మాత్రమే వారు హ్యాక్ చేశారని, దానిపై క్లిక్ చేస్తే యునైటెడ్ ఇస్లామిక్ సైబర్ ఫోర్స్ అని వస్తుందని, నిపుణులను తీసుకొచ్చి సమస్యను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.