పోలింగ్ బూత్ సమీపంలో పేలిన మందుపాతర
ఖమ్మం : ఖమ్మం జిల్లా చర్ల మండలం ఉంజపల్లి పోలీస్ కేంద్రం సమీపంలో మావోయిస్టులు భారీ మందుపాతర పేల్చారు. ఆంధ్రా-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం రావటంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఈ నేపథ్యంలో ఉంజపల్లికి పోలీసులు భారీగా తరలి వెళుతున్నారు.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఆర్మీ హెలీకాఫ్టర్లను వినియోగిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతం కావడంతో ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే సాయుధ దళాలను తరలించడానికి రెండు హెలీకాఫ్టర్లను సిద్ధంగా ఉంచారు.
మందుపాతర, మావోయిస్టులు, ఉంజపల్లి, ఆదిలాబాద్, naxals, Maoist blast, unjapalli, adilabad