unorganised sector labour
-
ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవడం ఎలా?
నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు వంటి అసంఘటిత కార్మికుల సమగ్ర డేటాబేస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 26న ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ వల్ల అసంఘటిత రంగంలోని 38 కోట్ల మంది కార్మికుల పేర్లను నమోదు చేయడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు అని కేంద్రం తెలిపింది. ఈ కార్మికుల కోసం రాష్ట్రాలు, కార్మిక సంఘాల సమన్వయంతో సామాజిక సంక్షేమ పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఏకీకృతం చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో పేర్లను నమోదు చేసుకున్న కార్మికులకు ఒక ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య గల కొత్త ఈ-శ్రమ్ కార్డు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ కూడా ఇంట్లో నుంచే ఉచితంగా చేసుకోవచ్చు. కొత్త ఈ-శ్రమ్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అసంఘటిత రంగంలోని కార్మికులు తమ ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా వంటి వివరాలు సాయంతో కొత్త పోర్టల్‌లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే జాతీయ టోల్-ఫ్రీ నంబర్ "14434"ను కూడా సంప్రదించవచ్చు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం ఎలా ఈ-శ్రమ్ పోర్టల్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో ఉన్న"రిజిస్టర్ ఆన్ ఈ-శ్రమ్" లింక్/సెక్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న సెల్ఫ్ రిజిస్ట్రేషన్ దగ్గర ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబరును నమోదు చేయాలి. కాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ), ఉద్యోగుల స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ)లో సభ్యుడు అయితే అవును అని, లేకపోతే కాదు అని ఎంచుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ నమోదు చేసి SUBMIT మీద నొక్కండి. ఆ తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ చేసి మళ్లీ SUBMIT మీద నొక్కండి. ఆధార్ నెంబర్ మీదేనా కదా అనే తెలుసుకోవడానికి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని నమోదు చేసి SUBMIT మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ లో ఉన్న పూర్తి వివరాలు కనిపిస్తాయి. మిగతా వివరాల నమోదు చేయడానికి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ వ్యక్తి గత వివరాలు, చిరునామా, విద్య అర్హత, వృత్తి, బ్యాంకు వివరాలు వంటివి నమోదు చేయవచ్చు. పైన పేర్కొన్న వివరాలు నమోదు చేశాక మీరు ఈ-శ్రమ్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు లేనప్పటికీ కార్మికులు ఉచిత రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న సీఎస్ సీ కేంద్రాలను సందర్శించి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ అసంఘటిత కార్మికులందరికీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్ బివై) కింద ఏడాది కాలానికి ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం చెందితే రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ.1 లక్ష రూపాయలు కేంద్రం జమ చేస్తుంది. -
అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!
దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం కార్మిక, ఉపాధిశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నేడు లాంఛనంగా ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను సేకరిస్తారు. అలాగే వారి సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఉపకరిస్తుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది. ప్రమాధ భీమా రూ.2 లక్షలు "భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా 38 కోట్ల మంది అసంఘటిత కార్మికుల వివరాలను నమోదు చేయడానికి ఒక వ్యవస్థ తయారు చేయబడుతోంది. దీనిలో వివరాలు నమోదు చేయడం ద్వారా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాలను పొందడానికి సహాయంగా ఉంటుంది" అని కార్మిక మంత్రి అన్నారు. అలాగే, ఇందులో తమ పేర్లు నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికులకు రూ.2.0 లక్షల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ అందించినందుకు ప్రధాన మంత్రికి శ్రీ భూపేందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక వ్యక్తి ప్రమాదానికి లోనై మరణిస్తే/శాశ్వత వైకల్యం చెందితే రూ.2.0 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ.1.0 లక్షలకు అందించనున్నట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది అని అన్నారు.(చదవండి: పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు) The e-Shram portal will cover all unorganised workers of the nation and help link them to social security schemes of the Government of India. The portal will prove to be a huge boost for the last-mile delivery of services. #ShramevJayate pic.twitter.com/wnEb0U85Uo — Bhupender Yadav (@byadavbjp) August 26, 2021 అసంఘటిత రంగ కార్మికులు నేటి నుంచే తమ పేర్లను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. పుట్టిన తేదీ, స్వస్థలం, మొబైల్ నంబర్ వంటి ఇతర అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. అలాగే, కార్మికుడు తన ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేశాక కార్మికునికి ఈ-శ్రమ్ కార్డు ఒకటి మీకు వస్తుంది. దాన్ని భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే.. నివృత్తి చేసుకునేందుకు జాతీయ స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 14434ని కూడా ప్రారంభించారు. -
e-Shram: కార్మికులకు అండగా ఇ-శ్రమ్
అసంఘటిత రంగంలో అనామకంగా ఉండిపోయిన కార్మికలకు అండగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. సంక్షేమం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు తదితర అంశాల్లో కార్మికులకు సహాయకారిగా ఉండేందుకు ఇ శ్రమ్ పేరుతో పోర్టల్‌ని ప్రారంభించనుంది. ఎంతమంది కార్మికులు భారత దేశంలో అసంఘటిత రంగంలో దాదాపు 38 కోట్ల మంది కార్మికులు ఉన్నట్టు అంచనా. కోవిడ్ సంక్షోభం సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊరుకాని ఊరిలో ఇటు యజమానులు, అటు ప్రభుత్వ మద్దుతు సరైన సమయంలో అందక ఇక్కట్ల పాలయ్యారు. దీంతో ఇటు పౌర సమాజం, అటు న్యాయస్థానాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అసంఘటిత కార్మికులు ఎంత మంది ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే అంశంపై నిర్థిష్ట కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఇ-శ్రమ్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కేంద్రం ఆగస్టు 26న ఇ శ్రమ్ వెబ్ పోర్టల్‌ని అందుబాటులోకి తేనుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అసంఘటిత రంగంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు. వీరిలో నిర్మాణ రంగం, వలస కార్మికులు, వీధి వ్యాపారులు ఇలా కేటగిరిల వారీగా ఎంత మంది ఉన్నారనే సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. అదే విధంగా ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది. ఒకే గొడుకు కిందికి ఇ శ్రమ్ పోర్టల్ అందుబాటులోకి రావడం వల్ల ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక సంఘాలు కూడా ఒకే గొడుకు కిందకు వచ్చే అవకావం ఉంది. దీని వల్ల కార్మికుల సమస్యల వెలుగులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం సైతం త్వరగా జరిగేందుకు వీలు ఏర్పడనుంది. ఆగస్టు 26న పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మికుల కోసం హెల్ప్‌లైన్ ఇ శ్రమ్ వెబ్ పోర్టల్‌తో పాటు అసంఘటిత కార్మికుల కోసం కార్మిక శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా 14434 నంబరును దేశవ్యాప్తంగా కార్మికులకు అందుబాటులోకి తేనుంది. చదవండి: JioMeet : ఆన్లైన్ క్లాసుల కోసం జియోమీట్.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో -
‘అసంఘటిత’లోనూ ప్రసూతి ప్రయోజనాలు!
న్యూఢిల్లీ: ప్రసూతి ప్రయోజనాల పథకం అసంఘటిత రంగ ఉద్యోగులకు వర్తించేలా ఈపీఎఫ్, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌తో కలసి పనిచేయనున్నట్లు లేబర్ సెక్రటరీ శంకర్ అగర్వాల్ తెలిపారు. వారికి ఆరు నెలలు వేతనంతో కూడిన సెలవు ఇచ్చే పరిస్థితి లేనందున వారు ఈపీఎఫ్, ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్లో దాచుకున్న డబ్బుకు సమాన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.