Upendra Gaadi Adda Movie
-
ఒకేసారి ఐదు సినిమాలు లైన్లో పెట్టిన కొత్త హీరో!
కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం 'ఉపేంద్ర గాడి అడ్డా'. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న విడుదల కానున్న సందర్భంగా హీరో కంచర్ల ఉపేంద్ర మీడియా సమావేశంలో స్పందించారు. 'కొత్తగా పరిచయం కాబోతున్న నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఐదు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఓ రోజు వైజాగ్ కళాకారుల పిక్నిక్కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. అక్కడ నన్ను చూసి ఓ దర్శకుడు కథ చెప్పడం, సినిమాలోకి రావడం జరిగింది. ఈ క్రమంలో ఉపేద్ర గాడి అడ్డా చిత్రాన్ని నిర్మించాం. యూత్ ఫుల్, మాస్, ఎంటర్ టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి అందరూ కనెక్ట్ అవుతారు. ఇందులో ఓ చక్కటి సందేశం కూడా వుంది. ఫోన్ వుంటే, దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఎటువంటి మంచి చెడులు అనేవి చూపాం. మహిళలు ఏ విధంగా వీటిని యూజ్ చేస్తున్నారు. ఇక సమాజంలో విలువలు ఏ విధంగా వుంటాయి అనేవి చూపించాం. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నటన కొద్దిగా నేర్చుకున్నా. ఆ తర్వాత నా జర్నీ ముందుకు సాగింది. నేను కొత్త హీరోను. ఒకేసారి ఐదు సినిమాలు చేయడం నా లక్ అని చెప్పాలి. ప్రస్తుతం '1920 భీమునిపట్నం' సినిమా నిర్మాణంలో ఉంది. ఇలా కొత్త దర్శకులను, నటీనటులను ప్రోత్సహించాలనే నిర్మాణ సంస్థను స్థాపించాం. ఉపేంద్ర అడ్డా దర్శకుడిలో క్రియేటివిటీ వుంది. తను చెప్పినట్లు తీయగలిగాడు. చిరంజీవి, ఎన్.టి.ఆర్., పవన్ కల్యాణ్ ఇలా ఒక్కో హీరోలో ఒక్కో ప్రత్యేకత వుంటుంది. అందరూ మంచి హీరోలే. నాకంటూ ఓ ప్రత్యేక వుంది. అది డిసెంబర్ 1న విడుదలయ్యే ఉపేంద్ర గాడి అడ్డా సినిమా చూస్తే అర్థమవుతుంది. కొత్తవారిని ఆదరిస్తారు.' అని కోరుకుంటున్నట్లు హీరో కంచర్ల ఉపేంద్ర తెలిపాడు. -
ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం : బ్రహ్మానందం
‘‘ఒక సినిమా తీయడానికే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం ఓ సంచలనం. తన కుమారుడు ఉపేంద్రని హీరోగా పరిచయం చేయడంతో పాటు ఒకేసారి అతనితో ఐదు సినిమాలు తీస్తున్న అచ్యుతరావుకి అభినందనలు. దీనివల్ల పరిశ్రమను నమ్ముకున్నవారికి అవకాశాలు ఇచ్చి, భోజనం పెట్టినట్లవుతుంది. ‘ఉపేంద్రగాడి అడ్డా’ మంచి హిట్టవ్వాలి’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్‌పై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘ఉపేంద్రగాడి అడ్డా’ ట్రైలర్‌ను, ‘1920 భీమునిపట్నం’ ΄ోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఉపేంద్ర హీరోగా ఇదే బ్యానర్లో తీస్తున్న ఐదు సినిమాల టీజర్లను విడుదల చేశారు. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో నవంబర్ నుంచి ప్రతీ నెల ఒక సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘నా పుట్టిన రోజుకి ఇది వెలకట్టలేని పెద్ద బహుమతి’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర. ‘‘సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. హీరోయిన్ సావిత్రీ కృష్ణ, సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. -
‘ఉపేంద్ర గాడి అడ్డా’ ప్రేక్షకులను సమ్మోహనపరుస్తుంది: నిర్మాత
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలే విడుదల చేసి, చిత్రం విజయవంతం కావాలని చిత్ర యూనిట్ కు శుభాభినందనలు అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, "మొదట్నుంచి నాకు సినిమా పిచ్చి ఉండేది. విడుదలైన అన్ని సినిమాలు చూస్తూండేవాడ్ని. అయితే నేను ఇతర వ్యాపార రంగాలలో బిజీ కావడంతో ఇంతకాలం సినిమా రంగంలోనికి ప్రవేశించలేదు. అయితే సినీ హీరో కావాలన్న మా అబ్బాయి ఉపేంద్ర తృష్ణను గమనించి, అతనిని హీరోగా పరిచయం చేస్తూ, ఐదు సినిమాలను మొదలు పెట్టాం. అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి. ఐదవ సినిమాగా మొదలు పెట్టిన ఈ సినిమా చాలా వేగంగా పూర్తయి, మొదటి సినిమాగా విడుదలకు సిద్ధమైంది. పూర్తి వినోదం, మాస్ అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను సమ్మోహనపరిచేవిధంగా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్రం రూపొందింది ఈ నెల 29న మా అబ్బాయి పుట్టినరోజున ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నాం. అదేరోజున ఈ చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేస్తాం. నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడంతో పాటు మిగతా మేము తీస్తున్న సినిమాలను ప్రతీ నెలా ఒక సినిమా చొప్పున విడుదల చేస్తాం’ అని చెప్పారు. ‘సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. దానివల్ల చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, మంచిని పెంపొందింపజేస్తే, సమాజం మరింత వికాసవంతం అవుతుందన్న సందేశాత్మక పాయింట్ ను కూడా ఇందులో ఆవిష్కరించాం’అని దర్శకుడు ఆర్యన్ సుభాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో కంచర్ల ఉపేంద్ర, హీరోయిన్ సావిత్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.