సింగపూర్‌లో ఉపాధ్యాయుడి వికృత చేష్టలు
సింగపూర్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సింగపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. సింగపూర్‌కు చెందిన 47 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాను జాయిన్ అయిన మూడేళ్ల కాలంలో దాదాపు 160 మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి అనుమతి లేకుండా అప్‌స్కర్ట్ వీడియోలు,ఫోటోలు తీశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే తాజాగా కొందరు మహిళల ఫిర్యాదుతో ఆ వ్యక్తిని జూన్ 23న పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల అనుమతి లేకుండా ఫోటోలు తీయడంతో పాటు వారి గోప్యతను భంగపరిచినందుకు గాను సదరు వ్యక్తిపై చార్జీషీట్ నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.(భీమవరంలో యువకుడు ఆత్మహత్య)
అయితే బాధితుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు ఈ ఘోరానికి పాల్పడిన వ్యక్తితో పాటు స్కూల్ పేరును చెప్పడానికి వీలు లేదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 2015 నుంచి జూలై 2018 మధ్య సదరు వ్యక్తి దాదాపు 168 మంది మహిళలు తమ దుస్తులు మార్చుకుంటున్న వీడియోలను వీడియోలు తీశాడు. ఇందులో మొదటి ఎనిమిది వీడియోలు 2015 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, తర్వాత ఎనిమిది 2016 మొదటి ఆరు నెలల్లో తీశాడని కోర్టు పేర్కొంది. ఇక 2017 వచ్చేసరికి ఆ సంఖ్య 105కు చేరిందని, అయితే నిందితుడు అన్ని వీడియోలను ఒకేసారి కాకుండా పాఠశాలలో నిర్వహించిన వివిధ వేడుకలను టార్గెట్ చేసుకొని తీసేవాడు. ఇలా 2018 సంవత్సరం వరకు దాదాపు 160కి పైగా అసభ్యకర వీడియోలను తీసి ఆ వీడియోలను వారికే చూసిస్తూ తనకు లొంగాలని లేకుంటే ఇవన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. అయితే అతని ఆగడాలను భరించలేని కొందరు మహిళలు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ నిమ్మితం జూలై 14న నిందితుడు మరోసారి కోర్టుకు హాజరు కావాలని కోర్టు తెలిపింది.
అయితే దీనిపై సింగపూర్ మినిస్ట్రి ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి శుక్రవారం మాట్లాడుతూ.. ఈ విషయం తెలియగానే స్కూల్ యాజమాన్యం 2018 జూలైలోనే అతన్ని విధుల నుంచి తొలగించిందన్నారు. అప్పటినుంచి అతను ఏ స్కూల్లో పాఠాలు బోధించడం లేదని తెలిపారు. ప్రవర్తనా నియమావళి కింద క్రమశిక్షణలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని, వారిని పదవిలోంచి తొలగిస్తామని అన్నారు. మహిళ యొక్క గోప్యతను భంగపరిచే విధంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠినమైన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశమున్నట్లు తెలిపారు.