159.8 మి.లీ. వర్షపాతం నమోదు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 159.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ముఖ్య ప్రణాళికాధికారి టి.సురేష్కుమార్ తెలిపారు. పెదపాడు మండలంలో అత్యధికంగా 25.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పోడూరు మండలంలో 1 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. మిగిలిన మండలాల్లో కాళ్ల 16.8, పాలకోడేరు 16.6, ఆకివీడు 15.6, ఉండి 15, నరసాపురం 11.2 వీరవాసరం 6.4, తాడేపల్లిగూడెం 5.8, పెనుగొండ 5.2, పెంటపాడు 5, మొగల్తూరు 4.8, ఏలూరు 4.6, ఆచంట 4.4, ఇరగవరం 3.4, నిడమర్రు, తణుకు, ఉండ్రాజవరంలో 2.8, పెదవేగి, యలమంచిలిలో 2.6, భీమవరం 2, పెనుమంట్ర 1.8, పాలకొల్లు 1.4, మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.