తన్మయపరచిన తానీషా నాట్యోత్సవాలు
కూచిపూడి, న్యూస్‌లైన్ : తానీషా యువ నాట్యోత్సవ్లో భాగంగా రెండో రోజు శనివారం నిర్వహించిన నాట్యాంశాలు కళాప్రియులను అలరించాయి. కూచిపూడిలోని కళావేదికపై అఖిలభారత కూచిపూడి నాట్య కళామండలి, పద్మభూషణ్ డాక్టర్ వెం పటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పాల్గొన్న కళాకారుల అందెల రవళులతో ప్రాం గణం మార్మోగింది.
కూచిపూడికి చెం దిన యేలేశ్వరపు సోదరీమణులు ఉషామాధురి, రాధిక నిర్వహించిన గాత్ర విభావరి పండిత పామరులను ఓలలాడించింది. గుడివాడకుచెందిన సంగీత విద్వాంసులు పోపూరి శ్యామ్ సుందర్ శిష్యురాండ్రైన వీరి కచ్చేరికి మృదంగంపై చింతా సూర్యప్రకాష్, వయోలిన్‌పై పాణ్యం దక్షిణామూర్తిలు సహకరించారు. వీరిని నిర్వాహకుల్లో ఒకరైన పసుమర్తి కేశవప్రసాద్ ఆధ్వర్యంలో మెమొంటోలతో సత్కరించారు.
అలరించిన నాట్యాంశాలు :
విశాఖపట్నంకు చెందిన కూచిపూడి నాట్య అకాడమీ ప్రధానాచార్యులు పసుమర్తి వెంకటరమణ శిష్యురాలు టీవీ ఎస్ఎస్ సాకేత ప్రదర్శించిన రెండు అం శాలు పూర్వ సాంప్రదాయపద్ధతిలో సాగాయి. నృత్యరవళి కూచిపూడి డాన్స్ అకాడమీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం. సురేంద్రనాధ్ శిష్య బృం దంతో కలసి ప్రదర్శిం చిన అంశాలు తన్మయత్వ పరిచాయి. పండిట్ బిస్మిల్లాఖన్ అవార్డీ, నాట్యాచార్య చింతా రవి బాలకృష్ణ శిష్యురాండ్రు ప్రదర్శించిన అంశాలకు రసజ్ఞులైన ప్రేక్షకులు కళానీరాజనాలందించారు.
మౌనిక, వల్లి ,పీ లాస్యప్రణతి, ఎం. సాయి చంద్రిక, బీ హరిప్రియ ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. చింతా రవి బాలకృష్ణ నట్టువాంగం, వీవీడి భవానీ గాత్రం, పీ హరనాధ్ మృదంగం , పీ ఆంజనేయుల వయోలిన్ మంత్రముగ్ధులను చేశాయి. తహశీల్దార్ జీ భద్రు ముఖ్యఅతిథిగా పాల్గొనగా అతిథులుగామాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య, కూచి పూడి సర్పంచ్ జీ జయరామ్, మొవ్వ ఏఎంసీ చైర్మన్ మండవ రత్నగిరిరాావు, వ్యాపారవేత్త పిన్నమనేని భీమశంకరరావు హాజరై ప్రసంగించారు. కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశకప్రసాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అ సందర్భంగా నాట్యాచార్యులు వేదాంతం రాధే శ్యాంను ఘనంగా సత్కరించారు.