యూకేలో భారత సంతతి మహిళ హత్య
లండన్: భారత సంతతికి చెందిన మహిళ బ్రిటన్ లో హత్యకు గురైంది. వివరాలు.. ఉషా పటేల్(44) లండన్లో క్రికిల్వుడ్ ఫ్లాట్లో వినికిడి సమస్యతో బాధపడుతున్న తన ఐదేళ్ల కుమారుడితో కలిసి నివాసముంటోంది. ఆన్లైన్ లో పరిచయమైన ఓ వ్యక్తిన గురువారం కలిసింది. అనంతరం ఆమె నివాసముంటున్న ఫ్లాట్ లోనే శుక్రవారం శవమైకనిపించింది.
ఆన్లైన్ లో పరిచయ మైన ఒక వ్యక్తిని కలవబోతున్నట్టు హత్యకు గురైన ముందు రోజు తనతో చెప్పినట్టు ఆమె సన్నిహితులొకరు తెలిపారు. అయితే ఆమె ఆన్ లైన్ లో నలుగురితో సన్నిహితంగా ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. వీరిలో మైల్స్ డన్నిలే(34)ని హత్యకు గురైన రోజే కలవడంతో పోలీసులు అతన్ని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.