utkur
-
ఊట్కూర్ శివారులో చిరుత సంచారం
ఊట్కూర్ : శివారు పొలాల్లో చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నా యి. ఆదివారం ఉదయం ఊట్కూర్ చెందిన కుర్వ శ్రీనివాస్, దివాకర్ తమకున్న గొర్రెపిల్లలను తీసుకుని శివారులోని సోలార్ ప్లాంట్ సమీపంలోకి వెళ్లా రు. కొద్దిసేపటికి వారికి చిరుత కనిపించడంతో భయపడి అక్కడి నుంచి పరుగులు తీసి సెల్ఫోన్లో గ్రామస్తులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా దాని అగుడుజాడలు కనిపించాయి. అలాగే పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు ఇంటిదారి పట్టారు. కాగా, 15రోజులుగా మండలంలోని జీర్ణహళ్లి, పెద్దపొర్ల, కొల్లూర్, దంతన్‌పల్లి, ఊట్కూర్ శివారు ప్రాంతాల్లోలో చిరుత సంచరిస్తున్నట్టు ఆయా గ్రామల ప్రజలు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఇప్పటికైనా స్పందించి వెంటనే దానిని ఇక్కడి నుంచి తరలించాలని వారు కోరుతున్నారు. -
శాంతి ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం
ఊట్కూర్ : శాంతి మానవత ఉద్యమాన్ని విజయవంతం చేద్దామని జమాతే ఇస్లామీ హింద్ మండల అధ్యక్షుడు కల్వాల్ ఖాలిక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21నుంచి సెప్టెంబర్ 4 వరకు తమ సంస్థ ఆధ్వర్యంలో శాంతి మానవత ఉద్యమం చేపపట్టనున్నట్లు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అన్నారు. నేడు కొందరు సంఘవిద్రోహ శక్తులు తమ స్వార్థంకోసం సమాజంలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సమాజంలో శాంతికోసం అందరూ సమైక్యంగా ఉద్యమించాలని కోరారు. అనంతరం గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఐహెచ్ ప్రచార కార్యదర్శి జావిద్, ఎస్ఐఒ మండల అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. -
ఊట్కూర్‌లో పోలీస్ పికెటింగ్
ఊట్కూర్ : మండల కేంద్రంలో శనివారం రాత్రి నాగుల పంచమి సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి స్థానిక పాతపేట వీధిలో బావిపక్కన ఉన్న నాగుల విగ్రహాల పరిసరాలను శుభ్రం చేస్తుండగా ఒక వర్గంవారు పోలీసులకు సమాచారం అదించారు. దీంతో ఎస్ఐ సిబందితో వచ్చి అక్కడివారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు వీడియో, ఫొటోలు తీశారు. దీంతో విషయం తెలుసుకున్న మహిళలు, యువకుల వచ్చి దేవాలయం వద్ద బురద కావడంతో మట్టివేస్తున్నామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గతంలో ఇక్కడవున్న కొన్ని నాగుల విగ్రహాలను ఒక వర్గం వారు బావిలో వేశారని ఆరోపించారు. వెంటనే పోలీసులు ఇక్కడినుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. విషయం తెసుకున్న కాంగ్రెస్ నాయకుడు కుంటిమారి లక్ష్మన్న, స్థానికులు అశోక్, వెంకటప్ప వచ్చి మహిళలు, యువకులను శాంతింపజేశారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తు రెండు వర్గాల వారిని రెచ్చగొడుతున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐని వివరణ కోరగా నాగుల పంచమి సందర్భంగా గ్రామంలో పలుచోట్ల పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ప్రజలను చైతన్యపరుస్తాం
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం – మూడోరోజుకు చేరిన పాదయాత్ర ఊట్కూర్ : నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు సాధించేందుకుగాను పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో మూడోరోజు ఆదివారం ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ నుంచి పాదయాత్ర కొనసాగింది. పాతపల్లి, అవుసలోనిపల్లి, పెద్దజట్రం, నిడుగుర్తిలో ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతోనే మూడు నియోజకవర్గాలలోని పది మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట డివిజన్ నుంచి వలసలు ఆగాలంటే ఈ ప్రాజెక్టు తప్పక చేపట్టాలన్నారు. దీనిని ప్రస్తుత ప్రభుత్వం పక్కనబెట్టి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 69 జీఓను ఫేజ్–1గా, 72 జీఓను ఫేజ్–2గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, గరిడి నింగిరెడ్డి; కాంగ్రెస్ నాయకుడు సరాఫ్ కష్ణ, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి కష్ణ, వివిధ పార్టీల నాయకులు గందే చంద్రకాంత్, సలీం, మాధవరెడ్డి, తిమ్మారెడ్డి, శేషప్ప, సత్యనారాయణరెడ్డి, అమ్మకోళ్ల శ్రీనివాస్, సాయిలుగౌడ్, హన్మంతు, నారాయణరెడ్డి, రాంరెడ్డి, సమరసింహారెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.