ఈ నెల 23 తర్వాత సీఎం కొత్త పార్టీ!
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 23 తర్వాత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని ఉత్తరాంధ్రకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని తెలిపారు. గతేడాదే రిజిస్టర్ అయిన ఓ పార్టీ పేరుతోనే సీఎం పార్టీని ప్రారంభిస్తారన్నారు.
కొత్తపార్టీ నమోదుకు గడువు లేకపోవడంతో ఇప్పటికే తనవెంట వచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై ఆయన కసరత్తు చేస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే వివరించారు. తన వెంట వచ్చే ప్రతి ఎమ్మెల్యేకు ఎన్నికల ఖర్చు కింద కోట్లాది రూపాయిలు సమర్పించుకునేందుకు ఇప్పటికే సీఎం కిరణ్ సిద్ధమైయ్యారని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో సీఎం పెట్టనున్న పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెల్లడించారు. తన పేరు మాత్రం వెల్లడించవద్దంటు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే విలేకర్లను కోరడం ఇక్కడ కొసమెరపు.