‘నర్తనశాల’ సహదేవుడు ఇక లేరు
అజరామర చిత్రం ‘నర్తనశాల’లో సహదేవ పాత్రధారి వి.నాగరాజారావు (78) మంగళవారం ఉదయం చెన్నై టి.నగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. నాగరాజారావు తండ్రి డాక్టర్ చంద్రశేఖర్ ప్రముఖ రంగస్థల నటుడు. ప్రఖ్యాత గాయని ఎస్.జానకికి నాగరాజారావు స్వయాన మరిది. ప్రఖ్యాత దర్శకుడు బిఎన్‌రెడ్డి ‘రంగుల రాట్నం’లో విజయనిర్మలకు జంటగా నటించిన నాగరాజారావు, ‘వీరాభిమన్యు’లాంటి పలు చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు. నటుడు రావికొండలరావు ‘ఆంధ్రా ఆర్ట్స్ నాటక సంస్థ’కు వెన్నుముకగా నిలబడి ఎన్నో నాటకాలాడారు. నటి శారద, గాయని ఎస్.జానకి తదితరులు నాగరాజారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.