'పార్టీలు వేరైనా.. మంచి స్నేహితులం'
చెన్నై: మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వీ రామారావు మృతిపట్ల తమళనాడు గవర్నర్ రోశయ్య సంతాపం తెలిపారు. ఆయన మరణం తనకు తీరని బాధను కలిగించిందన్నారు. ఈ సందర్భంగా రామారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
శాసన మండలిలో తమది 17 ఏళ్ల అనుబంధం అని రోశయ్య అన్నారు. పార్టీలు వేరైనా తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. జన్ సంఘ్ లో పనిచేసిన అనంతరం బీజేపీలోకి వెళ్లినా వీ రామారావు సేవలు మాత్రం అమోఘం అని రోశయ్య అన్నారు.