'తెలుగు ప్రజలకు తలవంపులు తెచ్చారు'
ఫ్లోరిడా(అమెరికా): ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాకంతో తెలుగు ప్రజలందరు తలవంపులు తెచ్చారని అమెరికా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ ప్రాంత ఇంచార్జ్ వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చర్యల వల్ల తెలుగువారు ఇతరుల ముందు చులకన అయ్యారని విమర్శించారు.
చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ప్రజలను అడ్డు పెట్టుకోవడం దారుణమని ఫ్లోరిడాలో వైఎస్ఆర్సీపీ దక్షిణ ప్రాంత నేతల సమావేశంలో వాసుదేవరెడ్డి అన్నారు. సెక్షన్-8 అమలు చేయాలనడం కొత్త సమస్యను సృష్టించినట్లవుతుందని తెలిపారు. అమెరికాలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి వచ్చే నెల 18న అట్లాంటాలో భారీ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వాసుదేవరెడ్డి చెప్పారు.