ట్రాన్స్ ఫార్మర్లలో రాగివైరు చోరీ
గోపాలపురం : వాదాలకుంట గ్రామ శివారు పంట పొలాల్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగివైరును దొంగిలించినట్లు రైతులు మంగళవారం పోలీసు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాదాలకుంట గ్రామానికి చెందిన గెడా జోగేంద్రప్రసాద్, గెడా రాంబాబు, జొజ్జవరపు బ్రహ్మానందం, ఈగల చిట్టిబాబులకు చెందిన 25హెచ్పీ, 40హెచ్పీ ట్రాన్స్ ఫార్మర్లలో రాగివైరు దొంగిలించినట్లు వెల్లడించారు. వైరు విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని వివరించారు.