లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు
బల్లికురవ : ముందు వెళుతున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో మండలంలోని వైదన గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీహరిరావు కథనం మేరకు కందకూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న కేఎంబీటీ ట్రావెలర్స్బస్సు వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కందకూరుకు చెందిన పర్రె సంధ్య, ఆమె కుమారుడు వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముందు భాగంలో కూర్చోవడంతో గాయాల పాలయ్యారు. మిగిలిన వారు క్షేమంగా ఉన్నారు. క్షతగాత్రులు నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.