ఆలయం నుంచి సాయిబాబా విగ్రహం తొలగింపు
వాల్సద్: గుజరాత్లోని వాల్సద్లోని ఒక ప్రముఖ ఆలయం నుంచి సాయిబాబా విగ్రహాన్ని తొలగించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ధర్మసంసద్(మత సంబంధమైన సదస్సు)లో చేసిన తీర్మానం ప్రకారం ఈ విగ్రహాన్ని తొలగించారు. విగ్రహాన్ని నేలమాళిగలో భద్రపరిచారు.బాబా భక్తులను సంప్రదించిన తరువాతే ఈ విగ్రహాన్ని తొలగించినట్లు ఆలయ ధర్మకర్తలు చెప్పారు.
ఛత్తీస్గఢ్లో సోమవారం ధర్మ సంసద్ పేరిట జరిగిన నిర్వహించిన ఆధ్యాత్మిక చర్చా కార్యక్రమంలో ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని అనుసరించే వారెవరూ సాయిబాబాను పూజించరాదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సాయి భక్తులు మరో చోట ఆలయం కట్టుకుంటే విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు వారికి అప్పగిస్తామని భీడ్ భంజన్ మహాదేవ్ ఆలయ ధర్మకర్తలు తెలిపారు.