ఆలయం నుంచి సాయిబాబా విగ్రహం తొలగింపు | Sai Baba idol removed from Valsad temple | Sakshi
Sakshi News home page

ఆలయం నుంచి సాయిబాబా విగ్రహం తొలగింపు

Published Wed, Aug 27 2014 9:09 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

వాల్సద్‌లోని ఆలయంలో తొలగించిన సాయిబాబా విగ్రహం

వాల్సద్‌లోని ఆలయంలో తొలగించిన సాయిబాబా విగ్రహం

వాల్సద్: గుజరాత్‌లోని వాల్సద్‌లోని ఒక  ప్రముఖ ఆలయం నుంచి సాయిబాబా విగ్రహాన్ని తొలగించారు.  ఛత్తీస్గఢ్లో జరిగిన ధర్మసంసద్(మత సంబంధమైన సదస్సు)లో చేసిన తీర్మానం ప్రకారం ఈ విగ్రహాన్ని  తొలగించారు. విగ్రహాన్ని నేలమాళిగలో భద్రపరిచారు.బాబా భక్తులను సంప్రదించిన తరువాతే ఈ విగ్రహాన్ని తొలగించినట్లు ఆలయ ధర్మకర్తలు చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ధర్మ సంసద్ పేరిట జరిగిన  నిర్వహించిన ఆధ్యాత్మిక చర్చా కార్యక్రమంలో ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ  సనాతన ధర్మాన్ని అనుసరించే వారెవరూ సాయిబాబాను పూజించరాదని ప్రకటించారు.  ఈ నేపథ్యంలో ఇక్కడి విగ్రహాన్ని తొలగించాలని  నిర్ణయం తీసుకున్నారు. అయితే సాయి భక్తులు మరో చోట ఆలయం కట్టుకుంటే విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు వారికి అప్పగిస్తామని భీడ్ భంజన్ మహాదేవ్ ఆలయ ధర్మకర్తలు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement