‘పాలమూరు ఎత్తిపోతల’కు మోకాలడ్డు
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: దశాబ్దాల కల సాకారమవుతుందంటే సంతోషించాం.. ప్రాజెక్టుల నీళ్లొచ్చి కరువు నే లలో బంగారం పండుతుందటే అంతకన్నా ఇంకే కావాలని భావించాం.. కానీ పాల మూరు ప్రజల సుదీర్ఘకాల స్వప్నంపై నీళ్లుచల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు సీమాం ధ్ర మంత్రులు కొందరు కంకణం కట్టుకున్నా రు. పథకం సర్వేకోసం తెచ్చిన జీనెం.72ను రద్దుచేయాలని మంత్రి టీజీ వెంకటేష్‌పై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ కోవలోనే ‘సుంకేసుల రిజర్వాయర్ పైభాగాన కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం గుండ్రేవుల వద్ద 12 టీఎంసీల నీటిని నిల్వఉంచేందుకు రిజర్వాయర్ ఏర్పాటుకు ఇదివరకే ప్ర భుత్వానికి నివేదిక పంపాం. ఆ తర్వాత రం గాపురం వద్ద కూడా రిజర్వాయర్ ఏర్పాటు కో సం అధికారులు నివేదిక పంపితే ఎందుకు పంపారు’ అంటూ నీటిపారుదల శాఖ అధికారులు వివరణ అడుగుతూ కర్నూలు జిల్లా అ ధికారులకు మెమో జారీచేశారు. పథకం ఆ గిపోతే పాలమూరు ప్రజలకు తీవ్ర అ న్యాయం జరగనుంది.
సుదీర్ఘకాల పోరాటం తరువాత..
మహబూబ్‌నగర్ జిల్లాలో 70 టీఎంసీల నీ టిని ఎత్తిపోతల పథకం ద్వారా వినియోగించుకునేందుకు వీలుగా పాలమూరు ఎత్తిపోత ల పథకం నిర్మాణం కోసం సర్వే చేసేందుకు ప్రభుత్వం ఈనెల 8న జీఓ నెం.72ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకా దు సర్వే చేసేందుకు *6.91 కోట్లు మంజూరు చేస్తూ అనుమతులు జారీ చేయడంతో సీమాం ధ్ర ప్రాంతానికి చెందిన చిన్న నీటిపారుదల శా ఖ మంత్రి టీజీ వెంకటేష్ ఆ జీఓను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఆయన కర్నూలులో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి కర్నూలు జి ల్లాకు అన్యాయం జరిగే విధంగా ఈ జీఓను వి డుదల చేసినందున వెంటనే రద్దు చేయాలం టూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిలపై ఒ త్తిడి తెస్తానని ప్రకటించారు. ఈ ఎత్తిపోతల ప థకం ద్వారా 70 టీఎంసీలను వాడుకునే విధం గా అందులోనూ ఎగువ భాగాన ఎత్తిపోతల ప థకాలకు అనుమతిస్తే శ్రీశైలం డ్యాంకు ము న్ముందు నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోతుం దని పేర్కొన్నారు. జీఓను రద్దుచేయించడమే త న లక్ష్యమని సవాల్ విసిరారు. సుధీర్ఘకాల పో రాటం ఫలితంగా పాలమూరు ఎత్తిపోతల ప థకం ఒక అడుగు ముందుకుపడటంతో జిల్లాప్రజలు కూడా ఎంతో సంతోషించారు. ఈ తరుణంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకు లు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఏర్పడింది.
పథకం రూపకల్పన ఇలా..
ఈ పథకం నిర్మాణమైతే మహబూబ్‌నగర్ జిల్లా తో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 10 ల క్షల ఎకరాలు అదనంగా సాగునీరు అందనుం ది. తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం రూ పొందించిన ‘పాలమూరు ఎత్తిపోతల పథకం’ ప్రణాళికను తయారు చేసి అప్పట్లో ప్రభుత్వం ముందుంచి వాటివల్ల జిల్లా ప్రజలు పొందే లబ్ధి గురించి అప్పట్లో స్పష్టంగా వివరించారు.
ఈ పథకం పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, దామరగిద్ద, మద్దూరు, హన్వాడ, కోయిలకొండ, నారాయణపేట, ధన్వాడ, ఊట్కూరు, మక్తల్, మాగనూర్, దేవరకద్ర, అడ్డాకల్, ఖిల్లాఘనపూర్, పెద్దమందడి, కొత్తకోట, వనపర్తి, పాన్‌గల్, గోపాల్పేట, తి మ్మాజిపేట, మహబూబ్‌నగర్, నవాబ్‌పేట, జడ్చర్ల, బి జినేపల్లి, బాలానగర్, ఫరూఖ్‌నగర్, మిడ్జిల్, కల్వకుర్తి, వె ల్దండ, కేశంపేట, తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల, కొందర్గు, భూత్పూర్, వంగూరు మండలాలు లబ్ధిపొందనున్నాయి. అదేవిధం గా రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబా ద్, ఇబ్రహీంపట్నం, పరిగి నియోజకవర్గాల్లోని 17 మండలాలకు, నల్గొండ జిల్లాలోని చింతప ల్లి, మర్రిగూడ మండలాలకు కలిపి మూడు లక్ష ల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రాష్ట్రం విడిపోయేందుకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడం తో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేం దుకు చర్యలు తీసుకుంటే తాము తీవ్రంగా నష్టపోతామంటూ సీమాంధ్ర నేతలు గళమెత్తడం విడ్డూరంగా ఉంది. ఈ విషయం తెలిసి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్‌పై భగ్గుమంటున్నారు.