మనవడి పూర్వజన్మ జ్ఞాపకాలే రప్పించాయి
నాగార్జున కొండను సందర్శించిన భూటాన్ రాణి తల్లి
విజయపురిసౌత్: ప్రముఖ బౌద్ధరామం నాగార్జున కొండను భూటాన్ దేశపు రాణి తల్లి అఫీదోర్జీ వాంగ్మోవాంగ్చౌ తన రెండో కూతురు, మనమడితో కలసి ఆదివారం సందర్శించారు. భూటాన్ రాజు చెల్లెలు కొడుకు జిగ్మే జితేన్వాంగ్చుక్ పూర్వ జన్మ జ్ఞానంతో గతేడాది నుంచి ఐదు తలల పాము (నాగముచ్ఛలేంద్ర), బుద్ధుడు ఉన్న ప్రాంతానికి జలాశయంలో నుంచి లాంచీలో వెళ్లాలని కలలో వచ్చిందని కుటుంబ సభ్యులకు చెప్పాడు.
ఇంటర్నెట్లో వెతకగా అది నాగార్జున కొండగా గుర్తించి ఇక్కడకు తీసుకువచ్చినట్లు వారు తెలిపారు. విజయపురిసౌత్లోని లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు రాజ కుటుంబీకులు ఆ బాలుడిని తీసుకువచ్చారు.