వర్సిటీ నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు
ఎస్కేయూ:
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మియామీలో రామన్‌ఫెలోషిప్ ప్రాజెక్ట్‌లో వర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర మద్దు ఏడాది పాటు పరిశోధన చేయాల్సి ఉంది. ఇందుకు ఎస్కేయూ అనుమతించలేదు. నరేంద్ర మద్దు హైకోర్డును ఆశ్రయించారు.
దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ దుర్గాప్రసాద్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అకడమిక్ పురోగతిలో భాగంగా చేస్తున్న పరిశోధనలకు అనుమతి ఎందుకు ఇవ్వకూడదని వర్సిటీ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కోర్టు తీర్పు ఆధారంగా తనను విధుల నుంచి రిలీవ్ చేయాలని ఎస్కేయూ ఉన్నతాధికారులను నరేంద్ర కోరారు.