'భారతీయుల్లో ప్రతిభాపాటవాలు మెండు'
హైదరాబాద్: భారతీయులకు అన్నింట్లోనూ ప్రతిభాపాటవాలు మెండుగానే ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తెలిపారు. సోమవారం వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ అమెరికా వారిచే మెర్లిన్ అవార్డును స్వీకరించబోతున్న సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ ఇంద్రజాలికులు సామల వేణుకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందులోనైనా గొప్పవాళ్లు ఉంటే వారిని వారు గొప్ప వాళ్లని ఒప్పుకొవటానికి సంకోచం మనకు సంకోచమన్నారు. అదే పరాయి వాళ్లల్లో ఉంటే గుర్తించి గౌరవిస్తామని తెలిపారు.
సామల వేణుకు మెర్లిన్ అవార్డు రావటం అందరికి గర్వకారణమన్నారు. కళలు రకరకాలు ఉంటాయని గుర్తు చేశారు. పిల్లలు ఆనందించే విద్య ఇంద్రజాలం అని తెలిపారు. కళాకారులను గౌరవించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జ్యోతిష్యం- ఇంద్రజాలం విభన్నమైనవి అయినా అవి రెండు విద్యలేనని చెప్పారు. భారతీయ కళా నైపుణ్యానికి నిదర్శనం ఇంద్రజాలం అని తెలిపారు. జస్టిస్ చలమేశ్వర్ చేతుల మీదుగా సామల వేణును ఘనంగా సత్కరించారు.