వాటర్ గ్రిడ్ ప్రణాళిక సిద్ధం చేయండి
నీలగిరి :జిల్లాలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు రూపకల్పనకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఆదేశించారు. జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులతో గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తు తం గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా పైప్లైన్ల స్థితిగతులు,తాగునీటి పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, మంచినీటి ట్యాంకుల నిర్వహణ, పనితీరుపై ప్రత్యేకంగా నివేది రూపొందించాలని సూ చించారు. గ్రామాల్లో పైపులైన్లు, మంచినీళ్ల ట్యాంకులు సక్రమంగా ఉంటే తప్ప వాటర్ గ్రిడ్ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులకు స్పష్టం చేశారు. మన ఊరు-మన ప్రణాళికలో పేర్కొన్న మం చినీటి ట్యాంకుల పనితీరు క్షేత్రస్థాయిలో ఏవిధంగా ఉందో ఏఈలు వెళ్లి పరిశీలించాలన్నారు. ఇటీవల రద్దుచేసిన తాగునీటి ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత కలి గిన వాటిని గుర్తించి జాబితాను మళ్లీ పంపించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ అడ్వయిజర్ ఉమాకాంత్ రావు, ఎస్ఈ రాజేశ్వరరావు, ఈఈలు పాల్గొన్నారు.