అనంత విజ్ఞానరాశులు వేదాలు
మహా మహోపాధ్యాయ విశ్వనాథ
రాజమహేంద్రవరం కల్చరల్ :
‘వేదాలు అనంతవిజ్ఞాన రాశులు. వాటికి మించి న విజ్ఞాన సంపద లే’దని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ పేర్కొన్నారు. దానవాయిపేటలోని వా డ్రేవువారి భవనంలో గురువారం జరి గిన వేదశాస్త్రపరిషత్ సర్వజనమహాసభలో ఆయన అధ్యక్షునిగా ప్రసంగించారు. భారతీయ సంప్రదాయంలో వేదాలకు మించిన విజ్ఞానం మరొకటి లేదని, మానవుల కర్తవ్యనిర్వహణకు మార్గదర్శకాలు వేదాలని అన్నారు. కర్మకాండ అంతా వేదరూపంలోనే లభిస్తోందని తెలిపారు. వేదం అపౌరుషేయమని, భగవంతుని నిశ్వాçÜరూపంగా వెలువడిందని పేర్కొన్నారు. ఉదయం వేదపరిషత్తు విద్యార్థులు, వేదపండితులు వేదస్వస్తితో పరిషత్ కార్యాలయంనుంచి విశ్వేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వేదస్వస్తి ముగిశాక మార్కండేయేశ్వరాలయంలో వేదపారాయణ నిర్వహించారు. సుమారు 170 మంది విద్యార్థులు వివి ధ∙విభాగాల్లో పరీక్షల్లో పాల్గొనగా 49 మంది కొన్నివిభాగాల్లో ఉత్తీర్ణులయ్యారు. 23 మంది పట్టాలు తీసుకున్నారు. పరి షత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి, సహాయకార్యద ర్శి పీసపాటి వెంకటసత్యనారాయణశాస్త్రి పాల్గొన్నారు.