ఘనంగా వేద పాఠశాల వార్షికోత్సవం
కరీంనగర్‌కల్చరల్ : నగరంలోని వేదభవన్‌లో ఆదివారం జెట్ వికాసతరంగిణి ఆధ్వర్యంలో పెద్దజీయర్ స్వామి తిరునక్షత్రం, వేద పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవన్నారు. ప్రపంచానికి వేదాన్ని నేర్పింది మనమేనన్నారు. వికాస తరంగిణి బాధ్యులు సీహెచ్ అయోధ్యరామారావు, గౌతంరావు , తదితరులు పాల్గొన్నారు.