ఘనంగా ‘గాడ్’ జన్మదిన వేడుకలు
రాయవరం (మండపేట) :
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) 81వ జన్మదిన వేడుకలు మంగళవారం పీఠంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గాడ్ సతీమణి సీతమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజలను ప్రారంభించారు. ఇక్కడి విజయదుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేదపండితులు గణపతి హోమం, గరిక పూజ, బిల్వపత్ర పూజ, నక్షత్ర జపం, నవగ్రహ పూజ, ఏకవార రుద్రాభిషేకంతో మహా మృత్యుంజయ హోమం, మన్యుసూక్త పారాయణ నిర్వహించారు. విజయదుర్గా అమ్మవారిని పలు రకాలుగా పూజించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.
నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం
గాడ్ జన్మదిన వేడుకల్లో భాగంగా తమిళనాడులోని తిరుత్తణి దేవస్థానం పండితులచే శ్రీవల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణాన్ని పీఠంలో నిర్వహించారు. స్వామివారికి, అమ్మ వార్లకు గురుకుల్ సంపత్, గోపిల ఆధ్వర్యంలో వేదపండితులు శాస్రో్తక్తంగా కల్యాణాన్ని జరిపించారు. అలాగే శ్రీసుబ్రహ్మణ్య త్రిశతి హోమం, శతాభిషేకం నిర్వహించారు. ఎండు ద్రాక్ష, ఖర్జూరం, జీడిపప్పు, వివిధ రకాల ద్రవ్యాలతో హోమం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి అసోసియేట్ రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమాన్, సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు, ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మ¯ŒS సత్తి బులిస్వామిరెడ్డి, సర్పంచ్ సూర్యబ్రహ్మానందరెడ్డి పలువురు మహిళలు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు పీఠంలో అన్నసమారాధన నిర్వహించారు.