veera raghava rao
-
బస్సులో రూ.50 లక్షల స్వాధీనం
మదురై : చెన్నై నుంచి మదురైకు బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మే 16వ తేదీ జరగనున్న నేపథ్యంలో ఎన్నికలలో నగదు బట్వాడాను అడ్డుకునే దిశగా ఎన్నికల కమిషన్ పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి మదురై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్‌కాల్ వచ్చింది. చెన్నై నుంచి మదురైకు వస్తున్న బస్సులో రూ. 50 లక్షల నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు చెప్పి ఆగంతకుడు ఫోన్ చేశారు. ఆ వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. మేలూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి పీర్ మహ్మద్, సబ్ ఇన్స్పెక్టర్ కలెసైల్వి, హెడ్కానిస్టేబుల్వ్రి సహా పోలీసు బృందం చిట్టంపట్టిలోగల టోల్గేట్ వద్ద కాపు కాసి.. సదరు బస్సును నిలిపి అధికారులు తనిఖీలు జరిపారు. బస్సులో ఒక ప్రయాణికుడి వద్ద గల ట్రాలీ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో వెయ్యి, 500ల రూపాయల కట్టలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.... అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కి తరలించి... విచారణ చేపట్టారు. చెన్నై సెంబాక్కంకు చెందిన తన పేరు రాధా (56) అని... స్థానిక హోటల్లో పని చేస్తున్నానని అతడు పోలీసుల విచారణలో తెలిపాడు. అతని యజమాని ఈ సొమ్మును మదురైకు తీసుకెళ్లి అక్కడ ఒక వ్యక్తికి ఇవ్వమన్నాడని చెప్పాడు. సొమ్ముకు తగిన ఆధారాలు లేకపోవడంతో రూ.50 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకుని మదురై జిల్లా ట్రెజరీలో అప్పగించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు స్వాధీనం చేసుకున్న సొమ్మును పరిశీలించారు. -
195 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్ : తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 195 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్టు తిరువళ్లూరు కలెక్టర్ వీరరాఘవరావు, ఎస్పీ శరవణన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లాకు వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలతో పట్టణంతో పాటు మనవాలనగర్ ప్రాంతంలో కవాతు నిర్వహించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా కలెక్టర్ వీరరాఘవరావు మీడియాతో మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 195 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించి, వాటిని క్షుణ్ణంగా పర్యవేక్షించడానికి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఆంధ్రా నుంచి ఒక కంపెనీ భద్రతా దళాలను రప్పించామని, అవసరమైతే మరిన్ని బలగాలను రప్పిస్తామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే విధులను నిర్వహిస్తున్న ఎన్నికల స్పెషల్ టీమ్‌తో కలిసి ఆంధ్రా పోలీసులు తనిఖీల్లో పాల్గొంటారని కలెక్టర్ వీరరాఘవరావు వెల్లడించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినా, ఎన్నికల సమయంలో నగదు, ఇతర వస్తువులు పంపిణీ చేయడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.