Veerabhadram tammineni
-
చెక్‌పవర్‌పై వెంటనే జీవో ఇవ్వాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌తో పాటు చెక్‌పవర్ ఇచ్చే వారెవరో నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానికనుగుణం గా జీవో జారీచేయాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గ్రామాల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడి మూడు నెలలు దాటుతున్నా నేటికీ పంచాయతీలకు చెక్‌పవర్ లేకపోవడం, గ్రామాల్లో మంచినీటి సమస్యతో పాటు, కనీస అవసరాలు తీర డం లేదన్నారు. సిబ్బందికి చెల్లించే అరకొర జీతభత్యాలు కూడా లేక పారిశుధ్య పనులు చాలా చోట్ల నిలిచిపోయాయని ఒక ప్రకటనలో తెలి పా రు. పంచాయతీరాజ్ కొత్త చట్టంలో సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్‌పవర్ నిబంధన ఉన్నప్పటికీ, సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శికి చెక్‌పవర్ ఇస్తామని ఇటీవలే సీఎం ప్రకటించారన్నారు. జాయింట్ చెక్‌పవర్ ఎవరికిస్తారనే దానిపై నేటికీ స్పష్టత లేదని, ఎన్నికల కోడ్‌కు, చెక్‌పవర్‌కు సం బంధం లేకపోయినా ప్రభుత్వం దాన్ని సాకుగా చూపుతోందన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఇతర గ్రాంట్స్ ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి చట్టబద్ధ ఆటంకమేమీ లేదన్నారు. -
పార్టీలు మారినా పరిస్థితులు మారలే..
బచ్చన్నపేట: దేశాన్ని గత 70 సంవత్సరాలుగా వివిధ రకాల పార్టీలు పాలిస్తున్నా ప్రజల స్థితిగతులు, పరిస్థితులు మాత్రం మారడం లేదని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి శిక్షణ తరగుతులు జరిగాయి. ఈ శిక్షణ తగతులకు తమ్మినేని ముఖ్యఅతిథిగా, ప్రజానాట్య మండలి మాజీ రాష్ట్ర కార్యదర్శి పీఏ.దేవి, ప్రజా యుద్ధ నౌక గద్దర్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల్ల సిద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు. పేదల హక్కులను కాపాడడానికి 70 సంవత్సరాలుగా ప్రజానాట్య మండలి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు. ఆనాడు దొరల పాలన విముక్తి కోసం నాట్య మండలి పని చేసినదని, నేడు ఈ ప్రభుత్వాల ఆడగాలను ఆపడానికి మళ్లీ ముందుకు వస్తుందని అన్నారు. తెలంగాణను ఏలుతున్న ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసింది ఏమీ లేదన్నారు. దేశంలో అశ్లీలత పెరిగి పోయిందన్నారు. ప్రభుత్వాల మోసాలను అరికట్టడానికి ప్రజానాట్య మండలి ముందుంటుందని అన్నారు. గద్దర్ ఆటాపాట... ప్రజానాట్య మండలి బహిరంగ సభలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన పాటలను అందరినీ అలరించినాయి. గద్దర్ గజ్జె కట్టి ఆడుతుంటే సభలో ఉన్న వారు అందరూ కోరస్ కలిపారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్, నాయకులు ఆముదాల మల్లారెడ్డి, మోకు కనకారెడ్డి, ఉడుత రవి, బొట్ల శ్రీనివాస్, మునిగల రమేష్, గొల్లపల్లి బాపురెడ్డి, మహబూబ్, సుధాకర్, నర్సింహా, వెంకటేష్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
పాదయూత్రతో కేసీఆర్ కు బెదురు: తమ్మినేని
కందుకూరు: ‘మహాజన పాదయాత్రతో సీఎం కేసీఆర్‌కు బెదురు పుట్టింది. అందుకే పాదయాత్ర మొదలైన ఈ 8 రోజుల్లో 8 వరాలు ప్రకటించారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాదయాత్ర కొనసాగితే ఐదు నెలలు ప్రభుత్వం అల్లాడి పోవాల్సిందేనన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, గూడూరు, కందుకూరు చౌరస్తా, దెబ్బగూడ, నేదునూరు గ్రామాలలో ఆయన పాదయాత్ర చేశారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల వంటివాటిని ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తల జేబులు నింపడానికే పథకాలను వాడుకుంటున్నారన్నారు. అగ్రకులాల ఆధిపత్యం తొలగి సామాజిక న్యాయం జరగాలనే అజెండాతో వెళ్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మంత్రి కేటీఆర్ ఆర్భాటంగా మొదలుపెట్టిన మైక్రోమ్యాక్స్ కంపెనీలో స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. 1,000 మందికి ఉపాధి లభిస్తుందన్న నాటి మాటలు నీటి మూటలయ్యాయన్నారు. ఇప్పటికైనా స్థానిక యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.