వేగేశ్న ఫార్మాసిటీలో పేలుడు,8మందికి గాయాలు
విశాఖ : విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరోసారి పేలుడు సంభవించింది. వేగేశ్న ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలి ఎనిమిదిమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలు దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు ధాటికి కంపెనీలోని ఉత్పత్తి బ్లాక్లు ధ్వంసం అవటంతో పాటు, ప్లాస్టిక్ షెడ్లు కూలాయి.
ఒక్కసారిగా పేలుడు సంభవించటంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మరోవైపు ఫార్మా కంపెనీ సమీపంలోని గ్రామస్తులు ఏమి జరుగుతుందో అర్థం కాగా భయాందోళనలకు గురయ్యారు. కాగా గాయపడినవారిని చికిత్స నిమిత్తం గాజువాక లంకెలపాలెం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో రాఘవరాజు, రవికాంత్, సూర్య, సతీష్ తదితరులు ఉన్నారు.