సైకో దాడిలో చిన్నారి సహా పలువురికి గాయాలు
బూర్గంపాడు (ఖమ్మం): ఖమ్మం జిల్లా బూర్గంపాడు శివారులో మంగళవారం ఓ ఉన్మాది జరిపిన రాళ్ల దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఇతడు ముందుగా భద్రాచలం నుంచి మణుగూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేయడంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వస్తున్న ఆటోపై కూడా దాడి చేశాడు.
అందులోని ఏడాది వయసున్న సుస్మితకు తీవ్ర గాయమైంది. మరో ఆటోపై కూడా దాడి చేశాడు. ఆ ఆటో డ్రైవర్, అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. వాహన చోదకులు, ప్రయాణికులు అతి కష్టమీద అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సైకో తన వివరాలేవీ చెప్పడం లేదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడిగా స్థానికులు భావిస్తున్నారు.