బయోటెక్నాలజీ సెంటర్ నెలకొల్పండి: వెలగపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల్లో బయోటెక్నాలజీ సెంటర్ నెలకొల్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్‌సభలో ‘సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ బిల్లు-2016’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పరిశోధనల్లో నాణ్యత ఉండాలంటే పరిశోధకులకు అత్యున్నత స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరముందన్నారు.
శాస్త్రవేత్తలు విదేశాలకు తరలివెళుతున్నారని, ఇందుకు మౌలిక వసతుల లేమి ఓ కారణమన్నారు. జెనెటిక్స్‌లో మరిన్ని పరిశోధనలు జరగాలని విజ్ఞప్తి చేశారు. కొత్త కొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వాటికి వ్యాక్సిన్లు కనిపెట్టడానికి చాలా కాలం పడుతోందని,. అందువల్ల పరిశోధనలకు తగిన నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.