velloru
-
జోస్ అలుకాస్‌లో 30 కిలోల బంగారం, వజ్రాల నగలు చోరీ!
తిరువొత్తియూరు: వేలూరులో ప్రముఖ నగల దుకాణం గోడకు కన్నం వేసి రూ. కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాల నగలను చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వేలూరు జిల్లా వేలూరు తోటపాలెం ప్రాంతంలో జోస్ అలుకాస్ నగల దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వ్యాపారం పూర్తయిన తరువాత ఉద్యోగులు దుకాణానికి తాళం వేసి వెళ్లారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఉద్యోగులు దుకాణం తెరిచి లోపలకు వెళ్లగా.. ఆ సమయంలో రాక్లలోని నగలు అన్ని అదృశ్యమైనట్లు గుర్తించా రు. వేలూరు నార్త్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలతో తనిఖీ చేపట్టి, సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. చదవండి: ట్రావెల్ బస్సు చోరీకి యత్నం.. ఇలా దొరికిపోయాడు! -
తమిళనాడులో దూడ వింత ప్రవర్తన
వేలూరు: తమిళనాడులో ఒక దూడ వింతగా ప్రవర్తిస్తోంది. మనిషి గుణాలు కలిగి ఉందా అన్నట్లు ప్రవర్తిస్తోంది. వేలూరు జిల్లా ఆంబూరులోని వీరాంకుప్పంకు చెందిన ఆనందన్‌కు చెందిన ఆవు ఇటీవల మగ దూడకు జన్మనిచ్చింది. ఈ దూడ రాత్రి వేళల్లో ఇంట్లోకి ప్రవేశించి చాప, దిండు ఉన్న చోట నిద్రిస్తోంది. ఇంట్లోని నీళ్లు తాగడం, చిన్నారుల కోసం తీసుకొచ్చిన తిను బండారాలను తింటూ వారితో కలిసి తిరుగుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఫ్యాన్, పాటలు వినేందుకు టేప్ రికార్డర్‌తో పాటు స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఈ దూడ సినిమా పాటలకు డాన్స్ కూడా చేస్తోంది. ఆకలి వేసినప్పుడు మాత్రమే తల్లి ఆవు వద్దకు వెళుతోంది. దీంతో ఈ దూడకు వేలన్ అనే పేరు పెట్టారు. -
వేలూరులో జల్లికట్టు
రెండేళ్లుగా వేలూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయితే ఈసారి అనుమతి ఇవ్వడంతో పెన్నాతూర్ గ్రామంలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. ఇందులో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలూరు జిల్లాలో ప్రభుత్వ అనుమతితో ఆది వారం మధ్యాహ్నం పెన్నాతూర్ గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. ఈ జల్లికట్టును తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. యువకులు కూడా ఉత్సాహంగా ఈ జల్లికట్టులో పాల్గొన్నారు. రెండు సంవత్సరాలుగా జిల్లాలో జల్లికట్టుకు నిబంధనల పేరుతో నిలిపి వేశారు. దీంతో ఈ సారి ప్రభుత్వ అనుమతితోనే ఆదివారం దీన్ని నిర్వహించారు. రెండేళ్లుగా నిరుత్సాహంగా ఉన్న యువకులు ఆదివారం కోలాహలంగా జల్లికట్టును జరుపుకున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసి కంచెను కూడా లెక్క చేయడకుండా యువకులు ఎద్దులను ఉరకలెత్తించారు. ఎద్దులు కూడా పౌరుషంతో లక్ష్యం వైపు దూసుకెళ్లారుు. వాటి ని అడ్డుకునేందుకు యత్నించిన సుమారు 20 మంది వరకు గాయాలపాలయ్యూరు. అయినా కుర్రకారులో మాత్రం ఉత్సాహం తగ్గలేదు. ఆ గాయూలను కూడా లెక్క చేయకుండా మరింత ఉత్సాహంగా ఈ క్రీడలో పాల్గొనడం విశేషం. అరుుతే యువకులు నెట్టుకుంటూ ఎద్దులు వెళ్లే దారిలోకి వచ్చేశారు. దీంతో వారిని అదు పు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత యథాప్రకారం జల్లికట్టును సాయంత్రం వరకు నిర్వహించారు.