'బాధ్యత వహిస్తూ బాబు రాజీనామా చేయాలి'
ఏలూరు : పుష్కర భక్తుల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేత వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేసిన ప్రచారానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో బాబు సర్కార్ విఫలమైందని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మృతిచెందడంతో పాటు మరికొంత మంది గాయపడ్డారన్న విషయం తెలిసిందే.